ఎక్కడ ఉంది స్వాతంత్ర్యం

ఎక్కడ ఉంది స్వాతంత్ర్యం

రచన: సుజాత కోకిల

మన భారతావని కన్న కళలు.

అమరవీరుల త్యాగాలు!మనం కన్న కళలు ఫలించాయి
తెల్ల దొరలు వచ్చి అధికారం చేతబట్టి,
మన సంపదలను మన స్వేచ్ఛను,
హరించి మనల్ని బానిసలుగా చేసి..
మన అధికారాలను తీసుకుని ,
ఉన్మాదాలతో మీకు ఏమున్నదంటూ !
చిన్నా పెద్దా లేక ఆడామగా తేడా లేక
నీతి మాలిన తెల్ల దొరలు మన ప్రాణాలను,
బలితీసుకొనిరి ఎందరో మహానుభావులు!
కన్న కలలు కళ్లలు చేసి మన కాళ్లకు,
బంధాలు వేసి ఎన్నో వికృత చేష్టలు చేసిరి.
అయినా వెనుకంజ వేయక ముందుకు,
కదిలి గుండెలు రగిలి ప్రాణాలకు తెగించి,
ఉదయించే సూర్యుడిలా నడుం బిగించి !
ప్రాణాలను లెక్క చేయక తెల్లదొరల గుండెల్లో
బడబాగ్నిలు రగిలించి కత్తులు పట్టక వెళ్లి !
మన జాతీయ జెండాను ఎగురవేసి వీరమరణం పొందారు

స్వాతంత్య్రం తెచ్చిన త్యాగ జీవులకు వందనాలు శతకోటి జై హింద్ మన భారతావని !

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!