వృద్ధాప్యం శాపమే!

వృద్ధాప్యం శాపమే!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

వృద్ధాప్యం శాపమే కొందరిపాలిట!
అదుపుతప్పిన జ్ఞానేంద్రియాలతో
అధీనంలోలేని కర్మేంద్రియాలతో
కండపుష్ఠి లేక, రక్తపుష్ఠి లేక
లేచి నడవలేక, కనీసం కదలలేక
మలమూత్రాదుల్లో మునిగితేలుతూ
తిన్నది జీర్ణించుకోలేక, కావలసింది అడగలేక
చూసుకొనేవారు లేక, అయినోళ్ళు చూసుకోక
చేసేది ఎవరికీ నచ్చక, చెప్పేది వినిపించుకోక
స్పందనతగ్గి, ఈసడింపులకు తలవొగ్గి
మానసికంగా, శారీరకంగా కృంగిపోయి
స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేసుకోలేక
భగవంతుడా తీసుకెళిపో అని ప్రార్థిస్తూ
అయినవాళ్ళనీ కానివాళ్ళనూ అర్థిస్తూ
అనుక్షణం నరకయాతన అనుభవిస్తూ
బాగున్నపుడు చావురాలేదని చింతిస్తూ
చావలేక బ్రతుకుతూ, బ్రతకలేక చస్తూ
హీనాతిహీనంగా గడపడం శాపమే మరి!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!