మనసు మౌన ఘోష

(అంశం. :”చాదస్తపు మొగుడు”)

మనసు మౌన ఘోష

రచయిత :: యం. సుశీల రమేష్

వద్దన్నా అంటగడితిరే
నాకు ఈ చాదస్తపు మొగుడ్ని
అయ్యో ఎవరితో చెప్పుకోను!
నా మనసు పాడే మౌన ఘోషను!
చెబితే వినడే
గిల్లకే ఏడుస్తాడే!
ఎడ్డెమంటే తెడ్డెం అంటాడే!
వేడిగా వడ్డించమంటాడే
వడ్డించాక మూతి కాలిందంటూ
మూడు వంకర్లు తిప్పుతాడే!
ఆబగా పచ్చి కౌగిలిస్తాడే
అమ్మో కొత్త పెళ్ళాం సుకుమారం
అంటూ అటుతిరిగి పడుకుంటాడే!
కొత్త సినిమా వచ్చిందంటూ తీసుకెళ్తాడే !
కిక్కిరిసిన జనాలను చూసి ఊపిరాడదు అంటూ వెనక్కి తీసుకొస్తాడే!
పట్టు చీర కొని తెచ్చాడే!
తీరా కట్టాక బరువంటూ విప్పనన్నాడే!
నామగడిని చూసి ఏడ్వాలో
నవ్వాలో తెలియదే మనసా!
ఎవరితో చెప్పుకోను ఈ చాదస్తపు మొగుడు రభస!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!