మధురవేదన

అంశం: మన్మధబాణం

మధురవేదన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

అద్దంలో ఆ మోము అరవిందమవుతుంది
తన రూపు తనకేను సరికొత్తగా ఉంది
మేఘాల కురులలో మరుమల్లె నవ్వింది
పగడాల అదరాల కంపనలు రేగేను
మీనాల కన్నుల్లు సిగ్గు బరువెక్కెను
చెంపల్లో కెంపులు అరుణిమలు దాల్చేను
సరికొత్త రవికేమో సరిగమలు పాడేను
జాలుతారు జిలుగుపైట నిలువలేకుండేను
వయ్యారి వాలుజడ సయ్యాటలాడేను
తనువంతా తపనలతో సెగలు రేపేను
మన్మధ బాణాలు మొలకలేసేను
మధుర వేదనలు మదిని కుదిపేను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!