ఓ తరువు ఘోష

ఓ తరువు ఘోష

రచన :: వి కృష్ణవేణి

ఓ నరుడా ఎందుకు ఈ ఘోరం
ఎందుకు నీకు అమానుషం
అప్పుడు పెంచావు నీవు
ఇప్పుడు తుంచావా
ఎందుకు ఈ ఘోరం
ఎందుకు చేసావు
ఈపాపం
నీకు పువ్వు నై, కాయనై,
పండునై, కట్టే నై
నీకు తోడు వచ్చానుగా
ఇక నీకు తప్పా మిగిలిన  తరానికి
నా విలువ తెలియకూడదనా
లేక నా అవసరం ఇక ఉండదనా
నీవు అలసిసొలసి వస్తే నీడనిచ్చింది నేనేగా
ఎందుకు నీకు కల్మషం
విత్తునుండిమొక్కగా మొక్కనుండి వృక్షానిగా
చేసి కాపాడవు.
మరీ నామీద కనికరం  లేకుండపోయిందా
ఇలా చేస్తే తప్పదు కాదమరిప్రకృతి విలయతాపం
అందుకేగా ప్రకృతి వినాశకానికి అడ్డుకట్ట  ఎలావేయగలవు
నీకు తెలియదా ప్రకృతి వైపరీత్యాలకు
కారణం ఒక్కొక్క చేట్టుతో మొదలుపెట్టి
అడవుల నిర్ములన వరకూ పోయిందని
దాని వల్లే వాతావరణ కాలుష్యం
ఏర్పడిందని
కలుషితం లేని స్వచమయినా గాలిని ఇచ్చేది నీనని, కలుష్య రహిత వాతావరణ
వచ్చేది నావల్ల  అని
ఒక్క క్షణం  నన్ను కొట్టె ముందు ఆగి అడగవలసినది  నీ చేతి గొడ్డలిని
తను ఎక్కడి నుండి వచ్చినది అని
నీవు అలసిపోతూ  పీల్చినగాలిని
అడగవలసినది నిన్ను ఎవరు పంపారాని
నన్ను తొలచి తలిచి నాముందే స్వేద తీరుతున్నావు.
నీకు ఊపిరి పీల్చి మెలుకువ వచ్చేసరికి
అంతా అయిపోతుంది
ఒక్క క్షణం ఆగి ఆలోచించు ఇకనైనా నాలాంటి  తరువును కాపాడు
తరతరానికి నన్ను,నావిలువను చాటి చెప్పు
నాలాంటివారిని తరతరానికి పరిచయం చేసిచూడు.
ఇదేనీవు ఇచ్చే ప్రకృతి కు
ప్రపంచానికి నీవిచ్చే నిజమయిన సంపద అని
వృక్షో రక్షిత రక్షితః అనిచాటి చెప్పు
ఓ నరుడా లే ఇకనైనా మేలుకో వృక్షలను రక్షించుకో….
అదే నీకు రక్ష అని తెలుసుకో…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!