కొత్త గాలి వీస్తోంది

*కొత్త గాలి వీస్తోంది*

రచన  :” రసస్రవంతి “&” కావ్యసుధ “
(ఎన్. బాలరాజు – ఆర్. హరి శంకర్ )

ఇప్పుడు ఉదయం నిద్ర లేవగానే
చెప్పుకునేది శుభోదయం కాదు
పలకరించేది
బావున్నారా అని కాదు
ఎలా ఉన్నారు అని
కుశల ప్రశ్నలు అడిగేది లేదు
పక్క వారు బాగున్నారా అని తెలుసుకునేది లేదు
పరిస్థితులు మారుతున్నాయి
కొత్త గాలి వీస్తోంది
‘హలో ‘అని పలకరించగానే
కోవ్యాక్సిన్ తీసుకున్నారా! కోవిషిల్డ్ తీసుకున్నారా !!
తీసుకోకుంటే నిర్లక్ష్యం చేయకండి!
వెంటనే ఇంజక్షన్ చేసుకోండి
కరోనా మహమ్మారికి బలికాకుండా చూసుకోండి !
నిర్లక్ష్యం చేస్తే నీ ప్రాణానికే ముప్పు
లేకుంటే తప్పదు నీకు నిప్పు
నీ ఆరోగ్యం కాపాడుకో !,!
మహమ్మారి నుంచి తప్పించుకో
చేతులకు శానిటైజర్
తప్పకుండా వాడండి !
మాస్క్ ను అసలే మరవకండి
ఇవే డాక్టర్లకు మించిన ఆయుధాలు!
ఎవరో వస్తారని ఎదురు చూడకండి!
వైరస్ నుండి కాపాడుకోండి
డాక్టర్లు దైవాలు కాదు
పోయే ప్రాణాన్ని ఆపలేరు
ఆయుష్షు తీరితే పరలోక యాత్రే
ఆస్పత్రులను నమ్ముకుంటే
పైసా పోతుంది ప్రాణం పోతుంది
అందుకే నిన్ను నీవే కాపాడుకో!!
దైవమే నిరంతరం నీకు రక్ష.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!