ఆభరణం

ఆభరణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఉమామహేశ్వరి యాళ్ళ

వయసుతో పనిలేకుండా ధరించగలిగితే
విలువైన ఆభరణంగా చూసుకోగలిగితే.
సమస్యలకి‌ పటిష్టతని చేకూర్చే నేస్తమిదేగా
కాలాన్ని‌ బంధించి మనముందుంచే సాహసి తనేగా.
వెరువనీయక వెనుకుండి రక్షించే రక్షణ తనేగా
మాటలలో చేష్టలలో దాగుండిపోతుంది.
వెన్నంటి‌ చెలిమిగా నిలిచిపోతానంటుంది.
తోడుగా తానుంటే అన్నింటా విజయమంటుంది.
వరించే కీర్తి ప్రతిష్టలు తనవలనంటుంది.
అలసటెరుగక నిరంతరంగా నవ్వులు రువ్వుతుంది.
అందరిలో ప్రత్యేక స్థానాన్నందిస్తుంది.
తనకంటూ ఎవరూ లేకున్నా తానందరి దాననంటుంది.
తన ఆశ్రయమే పెన్నిధిగా అనిపిస్తుంది
జరిగే ప్రమాదాలకి‌ ముందుంటూ ఆదుకుంటుంది
తనదంటూ ప్రత్యేక స్థానమంటుంది.
మెరుగులద్దితే మెరిసిపోతానంటుంది.
మురిసిపోతే మైమరపిస్తానంటుంది.
ఛీదరిస్తే ఫలితాలు కష్టసాధ్యాలంటుంది.
తనను ధరిస్తే చాలు అన్నింటా మనమే ముందంటుంది.
అదే సహనము చదువుల సారమైన
వెలకట్ట లేని ఆభరణము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!