స్నేహబంధం

స్నేహబంధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సరిత రవిప్రకాష్

మన ఈ స్నేహబంధం
పెళ్ళి బంధంగా మారింది
అందమైన జీవన పయనంలా
మళ్ళీ మళ్ళీ నీ జతగానే
నా జీవనం సాగాలి అని
కోరుకుంటున్నాను ప్రియా.
ఎన్నెన్నో జ్ఞాపకాల సమాహారం
మన అందమైన స్నేహ బంధం
జతగా మనకు మనమే తోడుగా
ఉండే ప్రయాణికులం మనమిద్దరం
నీ నా స్నేహానికి జ్ఞాపకాలే,
మనకు చుట్టాలు, జ్ఞాపకాలే
ఓదార్పులు.
మన ఇద్దరి మనసులోని
భావాలకు నీతోడే
నాకు తరగని పెన్నిధి.
నేను ఉన్నంత వరకు నువ్వు
నువ్వు ఉన్నంత వరకు నేను
ఇలాగే కలిసిమెలిసి ఉండాలి
ప్రియా ఎన్నటికీ మరవనిది
మన స్నేహబంధమై పెనవేసుకొని
ప్రణయ బంధంగా మారింది.
నా ఆశకు శ్వాసకు నీ స్నేహం,
నా ఊహకు ఊపిరికి నీ స్నేహం,
నా తనువుకి ప్రాణానికి నీ స్నేహం,
నా నడకకు గమ్యానికి నీ స్నేహం.
అటువంటి మన స్నేహం ఎప్పటికు
వీడిపోకూడదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!