“నన్ను మర్చిపో “
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : మాధవి కాళ్ల
నాకు నీతో మాట్లాడాలని ఉంది..
నువ్వే నాకు ఫోన్ చేయడం మానేస్తావు..
నువ్వు నా దగ్గర వేరే అమ్మాయి గురించి
మాట్లాడితే నా మనసు తట్టుకోవడం లేదు..
” నన్ను మార్చిపో ” నీతో చెప్పాను
నిన్ను మర్చిపోవడం నా వల్ల కాలేదు
నాకు నిన్ను చూడాలని ఎన్నో సార్లు చెప్పాను
కానీ నువ్వే నాకు దూరంగా ఉంటూ
నన్ను బాధపెట్టుతున్నావు
నీ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చిన
ప్రతిసారి నేను బాధపడుతున్నా
నీ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చిన
ప్రతిసారి నేను అన్న మాటలు నన్ను బాధ పెట్టుతున్నాయి
నీ పేరుని మర్చిపోలేక
ప్రతిరోజూ నీ పేరుని జపం చేస్తున్నా
నాకు నీతో నూరేళ్ళు జీవితం కావాలని ఆశ పడిన
నా లోపం నాకు గుర్తుకు వచ్చి నన్ను మర్చిపో
అని చెప్పి నిన్ను బాధ పెట్టాను.
నా లోపం వల్ల నీకు, నీ ప్రేమకి దూరం అయ్యాను
నిన్ను పెళ్లి చేసుకుని, నిన్ను జీవితాంతం బాధ పెట్టాలేను
నీ బాధని చూసి తట్టుకోలేను
నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.
నీ మంచి కోరుకొనే వ్యక్తిగా నీ జీవితంలో మిగిలిపోతాను.
నా కన్నీళ్లు నీకు తెలియకుండా జీవిస్తున్నా.
నీ దృష్టిలో నిన్ను ప్రేమించిన అమ్మాయిగా
నీ జీవితంలో మిగిలిపోతాను