గొడవల పడవ

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

గొడవల పడవ

రచన :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

కాదంటే ఔనంటుంది
ఔనంటే కాదంటుంది
తెలియదంటే నటనంటుంది
తెలుసంటే నీకేం తెలుసంటుంది….
అమాయకత్వమా అపనమ్మకమా
తెలివితక్కువ తనమా
నటనా తెలుసుకొనే లోపే
సంసార సాగరాన్ని ఈదనీయక
గొడవల పడవ ఎక్కించేస్తుంది
ఎందుకంటే…
అది అనుమానపు మల్లి
ఎవ్వరి మాటా వినని సీతయ్య చెల్లి
తప్పులెదికి చేస్తుంది లొల్లి
పసిపిల్లాడిలా మొగుడ్ని ఆటాడే లిల్లి
మొగుడు వేగక తప్పదు మళ్ళి మళ్ళీ
కారణం అది తన పిల్లల కన్న తల్లి….!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!