(అంశం: ” పెంకి పెళ్ళాం”)
బోల్తా కొట్టేనులే
రచన :: మంగు కృష్ణకుమారి
తలవంచుకొని తాళి కట్టించుకుంటూ ఉంటే
సంబరపడుతూ, చక్కిలిగింతలు పెట్టేను.
బిడియంగా తలంబ్రాలు
పోస్తూ ఉంటే ‘ఎంత కుదురయినదో’ అనుకుకున్నాను.
పాల గ్లాసుతో వచ్చి బుర్రే
ఎత్తకపోతే ‘ఎంతసిగ్గరో’
అనుకున్నాను.
నెల తిరగకుండానే ముసుగు తీసేసింది
మోమాటం మరిచింది.
రోజూ సిగరెట్లు కాల్చకూడదంది!
నెలకోసారే పేకాటంది
మందు మాటే మరవాలంది!
జీతంలో మొదట కొంత
దాచి కానీ ఇంటికి తేవద్దంది!
మా అమ్మని మంచి చేసుకుంది!
నాన్నని బుట్టలో వేసుకుంది!
రాలుగాయి నా పెళ్ళాం
నన్నూ బుట్టలో పడేసింది
నా అల్లరి పెళ్ళాం చంటోడిని ఇచ్చి
‘అంతా మీ పోలికే’ అంటూ నా ముక్కుకి తాడేసేసింది!