మనసే మనుగడకు ఆధారం

అంశం: మనస్సాక్షి

మనసే మనుగడకు ఆధారం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

సంకల్ప, వికల్పాలకు మనసే ప్రధానం
స్వచ్ఛమైన మనసు పవిత్రతకు సంకేతం
మనసా వాచా కర్మణా
ఒకే విధముగా ఆచరించు మానవుడు
స్థితప్రజ్ఞతకు దర్పణమే…!!

మంచి మనస్సుగల మనిషి
దైవత్వమునకు ప్రతీక
మనస్సాక్షిని మించిన దైవం లేదని
ఏ పని చేసిన మంచి చెడు అన్నది
అంతరంగమందున్న మనస్సు హెచ్చరించునని
పెద్దలు చెప్పినది అక్షర సత్యం..!!

ప్రేమించే మనస్సు గల మానవునికి
వసుదైక కుటుంబం వశమవుతుంది.
ప్రశాంతమైన మనస్సుతో ఏ పని చేసినా
విజయం వరించి గమ్యాన్ని చేరుదురన్న
స్వామి వివేకానంద మనకాదర్శం.
అందుకే మనసే ఆదర్శ మనుగడకు ఆధారం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!