మనసే!

అంశం: మనస్సాక్షి

మనసే!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖర రావు

మనసే మనకు కనిపించని ధర్మపధం!
తప్పుచేస్తుంటే తప్పు, తప్పని హెచ్చరిస్తుంది,
మంచిచేస్తే, సెహభాషని మెచ్చుకుంటుంది!
ప్రపంచంలోఎవరిమాట వినకు
నీ మనస్సాక్షి మాటేవిను
నీమనసు బాటే, నీకు పూలబాట,
నీమనసే నీకురాజమార్గము,
ఆత్మవిశ్వాస నిలయము,
మనసు పీకనొక్కకు,
మనసును అణగదొక్కకు
అడవి మనిషిగా జీవించబోకు,
మంచిపనులుచేసే మనసే
నీకు జీవితాంతం శ్రీరామరక్ష!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!