మనసా మాట వినుమా

అంశం: మనస్సాక్షి

మనసా మాట వినుమా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

మనసా మాయ చేయకే
మనసా మాట వినుమా
మనసా మంచి చేయవే
మనసా అలుసు చేయకే

మనసు మనిషిని నడిపిస్తుంది
మనసు మనిషిని కదిపిస్తుంది
మనసు మనిషిని కరిగిస్తుంది
మనసు మనిషిని వేదిస్తుంది

ఏది ఏమైనా ఏది ఎలా వున్నా
మనసే మనిషికి ముఖ్యం
మనిషి మనసుకె ప్రాముఖ్యం
మహోన్నతకు మనసే అతి ముఖ్యం

పగిలితే అతకనిది మనసు
మానవత్వాన్ని కలిగించేది మనసు
మారణహోమం సృష్టించేది కూడా మనసు
అందుకే మనసా మనిషి మాట విను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!