మనస్సాక్షికే అగ్నిపరీక్ష

అంశం: మనస్సాక్షి

మనస్సాక్షికే అగ్నిపరీక్ష
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

సత్యానికి నిజమైన సాక్షి
మనిషి మనసే మొదటి సాక్షి
సత్యం ఎప్పుడూ గెలవక పోవచ్చు
మనస్సాక్షి ముందు తల వంచక తప్పదు

కళ్ళు వెళ్ళే చోటికి
నిజం వెళ్ళ లేక పోవచ్చు కానీ,
మనసు రుజువు చేస్తుంది
ఆ మనస్సాక్షి ముందు ఓడిపోక తప్పదు

తప్పు ఒప్పులకు సాక్ష్యాలుండవు
మన మనస్సాక్షి ముందు
సత్యం ఒప్పకోక తప్పదు

హృదయాంతరాల్లో దాగిన
అనుభవాలకు మన
మనసే ఓ సాక్షీభూతం

మనస్సాక్షి కి ఆయుషు ఎక్కువ
నలిగిపోయే మనస్సాక్షి కే
నిత్యం ఓ అగ్ని పరీక్ష

You May Also Like

5 thoughts on “మనస్సాక్షికే అగ్నిపరీక్ష

  1. ఈ కాలం లో మనసాక్షి ఉందా విద్య గారు ఎవరికైనా
    🤦‍♂️👌👌👌👍✒️

  2. ధన్యవాదములు తప స్వీ
    🙏🙏🙏🙏

    1. ధన్యవాదములు సార్
      🙏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!