మనసే అందాల బృందావనం

అంశం: మనస్సాక్షి

మనసే అందాల బృందావనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వేల్పురి లక్ష్మీ నాగేశ్వరరావు

మనసే అందాల బృందావనం,
వాయువేగంతో పరుగులెత్తే మనసుకు,
వంకరటింకర భావాలెన్నో,
వయస్సుల తారతమ్యం లేకుండా,
వగలమారి కోరికలు ఎన్నో!
వయసుడిగిన వారికి తిండి యావ,
వయసులో ఉన్నవారికి మనసే కళ్లెం లేని గుర్రం,
ఊగిసలాడే మనసు
ఊపిరి ఉన్నంతవరకు,
ఉర్రూతలూగించే కోరికలతో
ఉయ్యాలలూగే,
‘ఉదయ భానుని లేలేత కిరణాలు,
ఉదయించే కల్మషం లేని
ఉషస్సులా, నీ మనస్సాక్షిని
ఉసి గొలుపు , మంచికి మారుపేరు గా,!!!.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!