మనస్సాక్షిని కాదనకు

అంశం: మనస్సాక్షి

మనస్సాక్షిని కాదనకు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

మనస్సాక్షి మనకి మన సాక్షి
నిన్ను నిన్నుగా ప్రశ్నించినా
నీకు నీవుగా గోచరించినా
నీ గమనానికి దారి చూపినా
నీ వదనానికి నవ్వు నింపినా
నీ భావానికి భాషనిచ్చినా
నిన్ను నిన్నుగా నిలిపేది
నీ మనస్సాక్షి మాత్రమే
బుద్ధిని నిత్యం ప్రచోదనం చేసి
మనసుకి ముడి వేసి నిలుపు
ఎక్కడా ఎపుడూ తలవంచక
సాగేలా నిన్ను అది నిలుపు
దాన్ని కాదని మెలగకు
నేల విడిచి సాగు చేయకు

You May Also Like

8 thoughts on “మనస్సాక్షిని కాదనకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!