మనోనేత్రం

మనోనేత్రం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

మనిషి కి మనసు మూడో నేత్రం అదే మరో నేత్రం. తను సృజనాత్మకంగా ఆ నేత్రం తో విషయాన్ని చూడగలిగితే, విజ్ఞానానంతో నడచుకో గలిగితే ఎంతో ఉన్నతంగా ఎదిగి నిలుస్తాడు.  తనకు సందేహం వచ్చినప్పుడు, వేసే అడుగు నడిచే దారి సరైనదో కాదో తెలుసుకుని మనగలిగితే తనకి తాను ఉన్నతంగా తయారై, ఉత్తమ సమాజ నిర్మాణానికి సహాయ పడగలడు. మనతో ఎంతో అన్యోన్యంగా ఉండే వారి విషయంలో తప్పకుండా అప్రమత్తత తో ఉండాలి. వేరే ఎవరైనా వారి గురించి మనకు ఏదైనా తప్పుడు విషయం గానీ లేదా చెడుగా చెప్పినప్పుడు గానీ తప్పకుండా ఆలోచించితీరాలి. ప్రతి వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు కదా. వారికి, వారికి మధ్య ఏముందో. మూడో వ్యక్తి గురించి అతని పరోక్షం లో మాట్లాడక పోవడం ఉత్తముల లక్షణం. మన బుద్ధికి ఎప్పుడూ పదును పెట్టుకొంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. అనవసరపు విషయాల మీద ఎక్కువ సమయం కేటాయించడం మంచిది కాదు. అలాగే ముఖ్యంగా ఏ బందన్నైనా మనో నేత్రం తో చూసి, అనుబంధాలను గుర్తు చేసుకుంటూ, ఆప్యాయతలను పంచుకుంటూ పోతే అవి ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అంతేకాదు యోగాభ్యాసం లో మనసు ఏకాగ్రత తో నిలపడం అనేది ప్రధాన ప్రక్రియ. అంటే మనసును నియంత్రించ కలిగితే మానసిక ఉల్లాసం కలిగించి, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇలా ఈ మూడో నేత్రంలా పని చేసే మనో నేత్రం ఎప్పుడూ తేజోమయంగా ఉంచుకోవాలి.

***

You May Also Like

7 thoughts on “మనోనేత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!