అశోకులమవుదాం

అశోకులమవుదాం

రచయిత ::జీ వీ నాయుడు

ప్రతి ఏటా జూన్ ఐదు వస్తుంది పదిలంగా
జరుపుకుంటున్నాము పర్యావణాదినోత్సవం గా
అమలులో చూపలేకున్నాం
పర్యావరణమే ప్రాణమని
పర్వావరణం ప్రాణవాయువులను
అందించే వృక్షాలనే
పెంచలేక వంచిస్తున్నాం
మరో అశోకుడు వస్తాడో రాడో
కానీ మనమే అశోకులమైతే
ప్రాణాలకు ప్రాణవాయువు
ఖరీదు లేకుండానే పొందలేమా
ప్రకృతి ఫై ప్రేమ చూపితే
అదే మనకు స్వర్గదామం కాదా
మనకెందుకు అనుకుంటున్నాం
మహా పాపాలను మూటకట్టుకుంటున్నాం
చిన్నారులకైనా అశోకుని
బోధనలు వివరిద్దాం
కాలుష్యం లేని సామాజాన్ని
ఆశిద్దాం
ప్రతి గృహం, పల్లె, పట్టణం, నగరం హరిత వనాలైతే
ఆరోగ్యానికి ఆయుష్షు తోడవదా
అందుకే నాటుదాం మొక్కలను వేల వేలుగా
భావితరాలకు అశోకులమవుదాం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!