(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
స్వప్న తీరం
రచన: వనపర్తి గంగాధర్
నా అంతరంగం కల్లోల సంద్రం
నా అంతరంగం జ్ఞాపకాల సుడిగుండం
గత కాలపు జీవిత అనుభవాల
సమూహ సమాహార పరివేదనం
రాళ్లు,ముళ్ళు,కష్టాలు,కన్నీళ్లు
ఆనందాలు,సంతోషాలు,సుఖాలు
అవన్నీ గడచిన మధుర స్మృతులు
నీ జీవితాన్ని దారిలో పెట్టిన పరీక్షలు
నా జీవిత పయనంలో తారసపడ్డ మైలురాళ్లు
ఆ ఒక్కో జ్ఞాపక మజిలీ
నా అంతరంగ స్మృతి వనంలో
మోదువారుతూనే ఉన్నాయి
చిగుళ్లు వేస్తూనే ఉన్నాయి
ఆర్ద్రమై నా మదిని గతకాలపు
గురుతుల సవ్వడులు వినిపిస్తూనే ఉన్నాయి
నా అంతరంగం నిలదీసి ప్రశ్నిస్తోంది
జీవిత పయనంలో ఏం సాంధించావని
కాలానికి కాపాలాదారు అంతరంగం
ప్రశ్నిస్తూనే ఉంది…
నీ జీవిత కాలంలో ఏం బావుకున్నావని..
మాసిపోయే నా వ్యక్తిత్వానికి
వర్ణాలద్దిన అంతరంగం…
నీకు తెలియదా నీ జీవితం
స్వప్నాల తీరం కై వెతులాటేనని…