పురోభివృద్ది

(అంశం:”అగమ్యగోచరం”)  

పురోభివృద్ది

రచన ::పి. వి యన్. కృష్ణవేణి

వినువీధిలో విహారిస్తున్నాము
తారలతో చెలిమి చేస్తున్నాము
చంద్రుడిపై ఆవాసంకై ప్రయత్నిస్తున్నాము
అడుగువెయ్య ఎదురుచూస్తున్నాము

సమాజ వృద్దిలో ముందంజ వేశాము
సంఘంలో గుర్తింపు పొందాము
ప్రతి విషయంలో విజయం సాధించాము
అన్నింటా పురోభివృద్దికి నాంది పలికాము

మనసు నన్ను నిలదీస్తోంది
కునుకు నాకు దూరమవుతోంది
ఎన్నో ప్రశ్నలు నన్ను వేదిస్తున్నాయి
ఇది మన నిజమైన పురోభివృద్దేనా!!

అడుగడుగునా ఆంక్షలు, అమర్యాదలు
అందకారంలోనే వారి బతుకులు
నేటి కాలంలో ఆడవారి జీవితాలు
మనసుకు విలువివ్వని మనుష్యులు

ఇదేనా మన పురోభివృద్ది అనేది
ఈ ఘోష ఎన్నో వేల మనసులది
అగమ్యగోచరంగా మారిన సమస్య ఇది
సంప్రదాయాలతో కట్టేసిన జీవితం మనది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!