కవిగా మార్చిన కరోనా

కవిగా మార్చిన కరోనా….

రచయిత :: రమాకాంత్ మడిపెద్ది

నిన్నటి వరకు నీనేంటో
నే నడిచిన దారేంటో
నే బతికిన బతుకెంటో
నాలుగు రాళ్లు వచ్చే పనే‌ ఉద్యోగమని
నలుగురికి సాయం చేయడమే సద్యోగమని
అదే యోగమని నమ్ముకుంటూ
ఒప్పు అన్పిస్తే ఎంత నోప్పైనా భరిస్తూ
తప్పు అన్పిస్తే ఎంత తోపైనా ఎదురిస్తూ
మన అనుకుంటే మనది అనుకుంటే ఎంతకైనా తెగిస్తూ
గాలి వస్తే ఎగిరిపోయే గమ్యం తెలియని గాలి పటంలా
ఆవేశం వస్తే ఉవ్వెత్తున ఎగసే ఉప్పెనలా
నాకంటూ ఓ లక్ష్యం ఉన్న
వినటానికి అది కోంచెం వింతగా ఉన్న
బలంగా కోరుకుంటే ఏదో ఓరోజు నిజం అవుతుందన్న ఆశతో ఎవెవో కలలతో  బతుకుతుంటే
నచ్చదని కన్పిస్తే ఆవేశపడుతూ
కోరుకున్నది జరగకపోతే కోప్పడుతూ
అవాల్సింది అంత అయ్యాక అరే అనవసరంగా చేసాన ,కాస్త ఆలోచించాల్సింది అని బాధ పడుతూ
అనుకున్న ‌అసలు విషయంపై  ఏకాగ్రత తప్పి
నన్ను నేనే కోల్పోతూ,నాకు నేనే దూరం అవుతూ
బయటికి చెప్పుకోలేని లోపలే దాచుకోలేని
అదెదో సినిమాలో చెప్పినట్లు కంటికి కన్పించని శత్రువుతో బయటికి కనపడని యుద్ధం చేస్తున్నట్లు
నాకేమైంది అనే‌ ప్రశ్నలా?
నా పని అయిపోయింది అనే సమాధానంలా…
అదే పనిలా బుర్రలో గిర్రునా తిరుగుతుంటే
ఆకలి కడుపు వాకిలి మరిచి
నిద్ర కంటి నీడను విడిచి
అన్ని విధాలా అలసి సోలసి ఇల్లు చేరిన నాకు
పరిచయం అవసరం లేని ,పలానా అని చెప్పనక్కర్లేని కరోనా అనే వింత రోగం
ఇల్లు దాటకుండా చేసిన వైనం
నా స్నేహితుల్ని దూరం చేసి
అదోరకం‌ అజ్ఞాతవాసంలా
మనుషుల మధ్య దూరం మరోరకం అరణ్య వాసంలా
ఎక్కడికి కదలనివ్వని నాలుగు గోడల సహవాసం
నా గురించి నేను ఆలోచించుకునేలా చేసింది
నాలో నే మరిచిన కళను నాకు మళ్ళీ గుర్తు చేసింది
ఒక్క మాటలో చెప్పాలంటే  ఎన్నో రోజుల క్రితం మూగబోయి ఆగిపోయిన
నా మనస్సులోని భావాలకు పదాలను పేర్చి , మాటలను కూర్చి
అర్థవంతమైన కవిత్వం రాయగలనని
కలమే నా బలమని, కవిత్వమే నా కలయని
చేయ్యగల్గితే ,చేయ్యలనుకుంటే చేతిరాతే తలరాతను మారుస్తుందని
నన్నో కవిగా, తానో రవిగా
బాధ కమ్మిన చీకట్లోకీ కవితోదయం తీసుకోచ్చింది
నన్ను నాకే కోత్తగా, సరికోత్తగా పరిచయం చేసింది….

You May Also Like

One thought on “కవిగా మార్చిన కరోనా

  1. నీ ఈ కొత్త ప్రయాణం యెల్లలు దాటి వికశించాలి అని ఆసిస్తూ ముందుకు తరలి పో నీ ప్రయాణానికి నా వంతు సహకారం ఉండాలి అని కోరుకుంటూ. 💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!