తీపి వాగ్దానాలు!

అంశం:అందమైన అబద్ధం!

తీపి వాగ్దానాలు!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

ప్రజలకోసం, ప్రజలచేత,
ప్రజలతో ఎన్నుకోబడ్డ
ప్రజాప్రభూత్వాలు తీపి
వాగ్దానాలతో కాలం వెళ్ళబుచ్చి,
ప్రజలను మభ్యపెడుతున్నాయి!
రాజకీయపార్టీలు అందమైన అబధ్ధాలతో
ఎన్నికై, ప్రజలను
దోచుకుంటున్నాయి!
మేం గెలిస్తే, అది ఉచితం,
ఇది ఉచితం అంటు,తీపి,
తీపి,అందమైన అబధ్ధాలను చెప్పి,పబ్బం
గడుపుకుంటున్నాయి!
మద్యపాన నిషేధం అనిచెప్పి, ఎన్నికవగానే
మద్యం ధరలు పెంచే
అబధ్ధాల కాలం ఇది!
పాపం, ఓటరన్నకు
తెలియదు, ఈచేత్తో ఇచ్చి,
ఆచేత్తో లాగేసుకునే కాలమిదని,
ఐదుపైసల సాయంచేసి,
ఐదుకోట్లు గుంజుతున్నారని,
అందమైన అబధ్ధం తీపి
వాగ్దానాల రాజకీయంలో భాగమని!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!