నయవంచకులు

అంశం : అందమైన అబద్దాలు

నయవంచకులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : సావిత్రి కోవూరు

నీవే నా ప్రాణం అంటూ, నీవు లేక నేను లేను అంటూ,
నిన్నుచూసిన మరుక్షణమే నేను వలచానంటూ,
మనది జన్మ జన్మల బంధమంటూ,
నీవే రంభవు, ఊర్వశివి అతిలోకసుందరివంటూ,
అపరంజి బొమ్మవంటూ,
నీతోడు లేకుంటే ప్రాణత్యాగం చేస్తానంటూ,
ఎప్పటికీ నీకు తోడునీడగా ఉంటానంటూ,
నిన్ను మహారాణిని చేస్తానంటూ
అందమైన అబద్ధాలతో అందలాలు ఎక్కించి, ప్రాణాలు తోడేసి,
మాయమాటలతో మంత్రాలు చేసి,
పబ్బం గడుపుకుని, పరారయ్యే
తేనె పూసిన కత్తుల్లాంటి ప్రబుద్ధులు ఎందరో ఈ లోకంలో.
అపరదాన కర్ణుడివి, శిబి చక్రవర్తివి నీవేనంటూ,
నీ దగ్గరకు వచ్చి సాయం కోరినవారికి నిరాశ ఉండదంటూ,
అందమైన అబద్ధాల మాయమాటలతో ముందరి కాళ్ళకు బంధం వేసి,
మునగచెట్టు ఎక్కించి, సాయం పొందిన మరుక్షణమే
ముఖం చాటేసేనయవంచకులు ఎందరో ఈ లోకంలో.
రోగి ప్రాణం పోతుందని తెలిసినా,
“నీకేం పరవాలేదు, నయమవుతుంది” అని చెప్పే మేలు చేసే
వైద్యుల అందమైన అబద్ధాలు ఎన్నో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!