అందమైన అబద్ధం (నానీలు)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : చింతా రాంబాబు
నీ అందమైన
అబద్ధానికి
నేను ఆకాశంలో
పక్షినైనాను
నా కనులకు
నిద్ర దూరం చేసింది
నీవు చెప్పిన
అందమైన అబద్ధం
చెమర్చే
నా కనులకు తెలుసు
నీవు చెప్పిన
అందమైన అబద్ధాలు
ప్రేమ నిండిన
అందమైన అబద్ధం
నిలబెడుతుంది
జీవితం.