చిట్టి ..బుజ్జీ..బంటి.. ఓ డేటింగ్

(అంశం:హాస్యకథలు)

చిట్టి ..బుజ్జీ..బంటి.. ఓ డేటింగ్

రచన: ఎన్.ధన లక్ష్మి

ఈ రోజు నా చిట్టి తో డేటింగ్ వెళ్తున్నా.అది ఫస్ట్  డేటింగ్ ఎలా ఉంటుందో! ఏమి మాట్లాడాలి.తనని చూస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోతూ ఉంటాను.అలాంటిది తనతో మాట్లాడ గలనా?
ఎలా ఉండే వాడిని, నన్ను ఎలా మార్చేసింది.
అసలు నా చిట్టితో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే.

  ఒక వారం క్రితం :
ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ,ఎలా పడితే అలా ఉంటూ,నచ్చింది తింటూ,అందరిని అప్పుడప్పుడు నా చేష్టలతో ఏడిపిస్తూ ఉండేవాడిని.
నన్ను పట్టుకోవాలని ఎంత ట్రై చేసిన దొరికేి వాడిని అసలు కాదు.అందరికీ పట్ట పగలే చుక్కలు చూపించే వాడిని.నన్ను మా వీధి ఏంటి ఊరు మొత్తం నన్ను తిట్టుకుంటే ఉంటే మస్తు మజా గా ఉండేది.ఎంతో మందిని చూసేవాడిని కానీ చిట్టి  నచ్చినంత గా ఇంకా ఎవరు నచ్చలేదు, అంతగా ఎవరు హార్ట్ లోకి చేరలేదు.
తన నవ్వు చూస్తూ ఒక సాంగ్ కూడా వేసుకున్న.ఈ మధ్య ఆ సాంగ్ కూడా సినిమాలో వచ్చి మంచి హిట్ అయింది…

//చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందో
నా గుండె ఖల్లాసే అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆ ఊసే నువ్వు  నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే
హతేరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్

లోకల్ గాని లోకంలోన రంగులు పుసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి  నా జిల్ జిల్ చిట్టిచిట్టి నా రెడ్ బుల్ చిట్టినా ఫేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే//

సాంగ్ మస్తు ఉంది లే!!!

  నేను చూస్తూ ఉంటే తను కూడా వాలు కళ్ళతో నన్ను చూస్తే ఉండేది.తన చిట్టి పెదాలు చూస్తూ ఉంటే చాలు ఈ జీవితానికి ఇంకా ఏమి అవసరం లేదు అనిపించేది. అవి అందుకోవాలని నా మనసు తహతహలాడేది.

   నేను మాట్లాడాలి అని చూస్తే సిగ్గుతో నా కన్న మెరుపు వేగంతో పారిపోయేది.తను మాటలు వింటూ ఉంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉండేదో.

  ఎలాగో అలాగ ధైర్యం చేసి తనని అడిగాను మనం ఇద్దరం డేటింగ్ కి వెళదాం అని. తను సిగ్గుతో వస్తాను అంది కానీ నువ్వు నన్ను ఏమి చేయకూడదు అని అడిగింది సిగ్గు పడుతూనే….

నేను నవ్వుతూ  ఫస్ట్ ఒకరిని ఒకరం అర్థం చేసుకుందాము.అన్నీ ఒకే అంటే మా వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను అని మాట ఇచ్చాను..

  ఇంకా నేను అయితే నా దోస్తులు అందరికీ దావత్ కూడా ఇచ్చ ! వాళ్ళు అందరూ అయితే ఇంకా పెళ్ళి ఫిక్స్ అవ్వలేదు కానీ నువ్వు ఏమో మాకు మస్తుగా పార్టీ ఇచ్చావు. మీ పెళ్లికి ఇంకా మస్తుగా ఇవ్వాలి అర్థం అయిందా మామ.తప్పకుండా రా మచ్చ.

   రేపటి రోజు చిట్టి తో నా డేటింగ్ కి ఎలా ఉండపోతుందో.తనతో ఒక్క ఫ్యామిలీ సాంగ్ కూడా వేసుకున్న డ్రీమ్ లో అదండీ మా ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ …

ప్రస్తుతం:

ఎప్పుడు లేట్ గ  లేచే వాడిని కాస్త త్వరగా లేచాను.
అమ్మ ఎక్కడికీ రా ఇంత పొద్దున్న “అమ్మ అది !నీకు చెప్పాను  కదా చిట్టి అని తనతో అలా తిరిగి వద్దాము అని అంటు నేను సిగ్గ పడ్డ అమ్మ తో అన్నీ పంచుకోవడం అలవాటు అలా చిట్టి గురించి మొత్తం చెప్పేశా”

  “కన్న బుజ్జులు! నీ తిక్క చేష్టలతో తనని ఇబ్బంది పెట్టకుండా నీ ప్రేమను అర్థం చేసుకునే లాగ చేయి రా అని నాన్న కు తెలీకుండా నాకు డబ్బులు కూడా ఇచ్చింది.అమ్మ  దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను.

వస్తున్న వచ్చేస్తున్నా వద్దు అన్న వదిలేస్తాన  పాట పాడుకుంటూ వెళ్తున్నా నాకు జిలేబి కనపడింది.ఇంకా ఏమి ఉంది టెంప్ట్ అయ్య. నేను అలా వెళ్ళాను లేదో నన్ను బోనులోకి లాగేసింది ఏమి జరిగిందో అర్థం అయ్యే లోపు నేను పూర్తిగా ఇరుకుపొయ్య.ఎలాగో వాళ్ళు ఊరి చివరకి తీసుకొని వెళ్ళి మరి దింపుతారు లే. అప్పుడు ఎంచక్కా పారి పోవచ్చు అని ప్లాన్ వేసా అయిన ఈ మనషులు నన్ను ఎన్ని సార్లు పట్టుకోలేదు నేను ఎన్ని సార్లు తప్పుకున్న వీళ్లు నన్ను ఏమి చేయాలి.

అసలే నేను వినాయకుడి వాహనం,నన్ను ఏమి చేయలేరులే. ఈ దిక్కుమాలిన ,తెలివి లేని ఆలోచన నా జీవితాన్ని ఉప్పెనలా ముంచేస్తుంది అనుకోలా..

  మిగిలిన జిలేబిని ఎందుకు వెస్ట్ చేయాలి అని మొత్తం తిన్న.తిన్న సెకండ్ లోపు నేను ఈ ప్రపంచాన్ని ,నా చిట్టిని వదిలేసి వెళ్లి పొయ్య..

  నేను చూస్తూ వుండగానే నా ప్రాణం నా నుంచి వేరు అయి పోయింది.నా ఆత్మ కూడా కూడా బయటకు వచ్చేసింది. ఏమి జర్గుతుందో చూద్దాము అని అక్కడే ఉన్న…కొద్ది సేపు ఆ ఇంటి బుడ్డోడు వచ్చి నన్ను వాళ్ల ఇంటి ముందర  ఉన్న కాలి ప్రదేశంలో నన్ను పూడ్చి వాడు సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా లోని అన్నీ అకౌంట్లో RIP బుజ్జి ఎలుక🐀అని  పోస్ట్ చేసాడు.

  ఓరి పిచ్చి బడకావ్.ఈ జనరేషన్ పిల్లలు మరి ఘోరంగా తయారు  అయ్యారు బాబు! ప్రతి ఫీలింగ్స్  ఇలా వాళ్ళ స్టేట్ స్ లో పెట్టీ పడేస్తున్నారు..

   నా నోటి దూల కాకపోతే హ్యాపీ గా నా చిట్టి దగ్గరికి వెళ్ళా కుండా జిలేబి కోసం టెంప్ట్ అయి ఇలా చచ్చ.

  ” ఎవరి కర్మ ను వాళ్ళు అనుభవించక తప్పు దు .. రా అన్నో..”అని నన్ను నేను తిట్టుకుంటూ ..నా చిట్టి కోసం వెళ్ళాను తను నా కోసం చూస్తే ఉంటే నా మీద చాడిలు చెప్పాడు మా ఎదురింటి ఉడతలు పట్టే వెదవ బంటి గాడు. అసలే వాడు నా కన్న అందంగా ఉన్నా డు.ఎందుకు ఉండడు అసలే  వాడి ఓనర్ ఫారిన్ రిటర్న్.పైగా వాడు తన పెంపుడు జంతువు అయ్.

   మన దేశములో ఇలా పెంచుకోవచ్చు కదా ఏమి మనషులో ఏంటో కర్మ రా బాబు.
కుక్కలను,చేపలను ,పక్షులను పెంచుకున్నట్టు ఎలుకలను కూడా పెంచుకోవచ్చు కదా

   నా చిట్టి  నేను మోసం చేశాను అని నమ్మి ఏడుచుకుంటు వెళ్లిపోయింది.

     వెళ్ళతున్న చిట్టీ వైపు చూసి బంటి గాడు వేళ్ళు తిరిగి తిరిగి నువ్వు నా దగ్గరికి రావాలి ఎందుకంటే వాడు చనిపోయాడు.వాడికి  జిలేబి ఇష్టం అనే తెలిసే నా దోస్తు గాడికి చెప్పి ఇద్దరం కలసి విషం చల్లి అల వాడు వచ్చే దారిలో  పెట్టీ వాడిని చనిపోయే లాగ చేసా అని పగలబడి నవ్వాడు …

      అమ్మ బంటి గా ఎంత మోసం రా
నీ నుంచి నా చిట్టీ నీ కాపాడుకోవడానికి,నిన్ను అంతం చేయడానికి నేను మళ్ళీ పుడుతాను రా.
హేయ్ వినాయక నన్ను బ్రతికించు ప్లీజ్ ప్లీజ్ దేవుడా అని తను తపస్సు చేసి మళ్లీ పుట్టింది…
” చంటి ఇస్ బ్యాక్ నౌ..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!