నా తోడై నువ్వే రావా
రచన: అక్షర
నా కను రూపు నీవై నిలిస్తే కనుపాప పులకించి పోదా
నా గొంతు లోని స్వరం నీవై పలికేస్తే నా గానం గర్వ పడద
నా ప్రాణ హృదయంలో ప్రేమే నీదై
నీ శ్వాసగా నే నిలిస్తే
నా ప్రేమకు ఇక ఆనకట్ట అడ్డుపడుతుందా
నన్ను నన్నుగా ప్రేమించు
నీలో ఎప్పుడు పువ్వుల సువాసనలా పరిమళాలు వెదజల్లుతా
నా ప్రేమలో నువ్వు రాసే ప్రతి అక్షరంలో పదంలా ఉండిపోతా నీ చేతి స్పర్శలో
నువ్వు చిందే చిరునవ్వు గా వెలుగుతూ
నువ్వు నడిచే దారిన నీ తోడై వస్తూ నిన్ను కాపలా కాస్తూ
నిన్ను నిన్నుగా దగ్గర చేసుకొని
మన ప్రేమలో తోడు నీడై కాకుండా
ఇరువురి దేహాలను ఒక్క ప్రాణంగా మార్చి జీవించేద్దాం..