పాపమా – పుణ్యమా

పాపమా – పుణ్యమా

రచన: సంజన కృతజ్ఞ

ఒక ఆవిడ రోజు సాధువుకి ఇడ్లీ పెడుతుండేది, కానీ తర్వాత అమ్మ బాగున్నాయి అని చెప్పడే వీడికేం మాయరోగం, అని ఇలా ఏమైనా చెప్తాడా! నా ఇడ్లీ గురించి – చెట్ని గురించి అని రోజుఎదురు చూస్తూ రుసరుస గా అతడివైపు చూస్తూ ఉండేది! అతను మాత్రం చేసుకున్నవారికి చేసుకున్నంత అని ఒక డైలాగ్ మాత్రం చెప్పి వెళ్ళిపోయేవాడు! ఇలా 3,4 రోజుల తర్వాత ఆమెకి ఓపిక నశించి వీడికి ఇలా కాదు ఇంత విషం కలిపి ఇస్తా అప్పుడుగాని తిక్క కుదరదు అనుకొని మళ్లీ వద్దులే అని తనకు తానే తమాయించుకుంటుంది! ఒకరోజు చింపిరి జుట్టుతో మాసిన బట్టలతో ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చేది గమనించి ఎవరు బాబు అన్నంతలో తన కొడుకే అని గమనించి ఇలా ఎలా అని ఆశ్చర్య చకితురాలై దగ్గరికి తీసుకొని ఏమైంది రా నాన్న అని తెలుసుకోగా
నా పర్సు పోయింది ఆకలిగా ఉంటే ఊరి పొలిమేరలో చెట్టు కింద ఉన్న సాధువు రెండు ఇడ్లీ పెట్టి ఆకలి తీర్చాడమ్మా అన్నాడు ఒక్కసారిగా గుండె గుభేల్ మంది! తను విషం కలిపి ఉంటే తన కొడుకు అమ్మో అనుకోడానికి భయంగా ఉంది అని పశ్చాత్తాపపడి సాధువు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది!

నీతి – ఎవరు ఎంత చేసుకుంటే అంతే
పాపం చేసుకుంటే పాపం తోడై
పుణ్యం చేసుకుంటే పుణ్యం తోడై వస్తుందని అర్థం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!