నచ్చిన మనిషే అయితే

నచ్చిన మనిషే అయితే..

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఇంకా వారంలో పెళ్ళి… ఇంత వరకూ బాగానే ఉంది. ఇకముందు ఎలా ఉండబోతోందో. తలచుకుంటేనే, భయం వేస్తోంది.

పసుపు కొడుతున్నారు మా ఇంట్లో ఇవాళ. ఇల్లంతా సందడిగా ఉంది. నా మనసు లో మాత్రం అలజడిగా ఉంది. చీ, ఇవన్నీ మా బామ్మ చాదస్తాలు. లేకపొతే ఇప్పటి వరకూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు,  ఒకరిని ఒకరు చూసుకోక పోవడం ఏమిటి?

ఈ రోజుల్లో కూడా ఇవన్నీ పాటించి, నా పెళ్లి లో తను పెత్తనం చేసేందుకు కాకపొతే. మనసులో బాగా తిట్టుకుంటున్నాను బామ్మని.

అందుకే, లవ్ మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాను. కానీ అది కూడా మా బామ్మ వల్ల ఆగిపోయింది.

నేను లవ్ చేసిన అమ్మాయి వాళ్లు  మా వీధిలోనే ఉండేవాళ్లు. మా బామ్మ చాదస్తానికి భయమేసి, నాతో పెళ్లి అంటే,  వామ్మో అన్నారు.

ఇంకా ఈ సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇది కూడా మా అమ్మ, బామ్మ వాళ్ళు చూసిందే. ఇలా ఉన్నాయి నా  ఆలోచనలు.

వికాస్, పెళ్లి లేట్ అయితే అయ్యింది కానీ, భలే మంచి అందగత్తె ని కొట్టేసావ్. అంది మా అత్తయ్య.

అవునా, నిజంగా అంత బాగుంటుందా. నేను కోరుకున్నట్టు, చిలక ముక్కు, వాలుజడ, సన్నటి నడుము, నవ్వితే ముత్యాలు రాలే పెదవులు, నడిస్తే కందిపొయే పాదాలు, అతి సుకుమారంగా ఉండే చేతులు… అనుకుంటూ..అమ్మో, నేను ఇలా ఆలోచిస్తే, నన్ను ఇంకా ఏడిపిస్తారు అనుకుంటూ,

అవునా అత్తయ్యా, అంత బాగుంటుందా? అన్నాను.

అత్తయ్య ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి నువ్వు చూడలేదా? అంది.

ఇదంతా మా అమ్మ పనెనా అనుకుంటూ వెళ్లి, బామ్మ ని తిట్టి పోసింది.

ఇంకా పెళ్లి వారమే ఉంది, నువ్వే వాళ్లని ఒకరికి ఒకరిని పరిచయం చేయ్యాలి. ఇంకా నీ కాలంలో ఉన్నాననుకున్నావా?

అయినా, నువ్వు ఎలా ఒప్పుకున్నావురా, ఆమ్మాయిని చూడకుండా పెళ్లి చేసుకోవటానికి అని అందరి మీదా అరిచింది అత్తయ్య.

హమ్మయ్య, నాకు రూట్ క్లియర్ అవుతుంది అని నా మనసులో నేను సంతోష పడుతున్నా.

నాన్న తో వాళ్ల కి ఫోన్ చేయించి, మేము ఒకరిని ఒకరు చూసుకోవటానికి ఏర్పాటు చేయించింది. అత్తయ్య.

తర్వాత రోజు సాయంత్రం ఆరు గంటలకు, మంచి పేరు ఉన్న ఒక గుడిలో (ఇది కూడా మా బామ్మ కి నచ్చిన ప్లేస్) మేము చుసుకొవటానికి అందరూ ఒప్పుకున్నారు.

నేను 6 గంటలకి ఒక 5 నిముషాలు ముందే గుడికి చేరాను. దేవుడి దర్శనం చేసుకుని, ఒక పక్క గా కూర్చున్నాను. ఆ దేవుడిని చూడగా నువ్వు వస్తే, నా దేవి ని చూడగా నేనోస్తే… పాట హమ్ చేస్తున్నాను.

బానే పాడుతున్నావే  అంటూ వచ్చింది గగన.

నేను ఆశ్చర్యం గా తననే చూస్తున్నాను.

గుర్తు ఉన్నానా? మీ వీధి లో నే ఉండేవాళ్ళం.. అంటూ నవ్వింది.

మర్చిపోలేదు లే గగన. ఎలా ఉన్నావు?  ఏంటి విశేషాలు అని మాట్లాడుతూ, తన కోసం వెతుకుతున్నాను వచ్చిందేమో అని.

ఇంతలో గగన వచ్చి చొరవ గా నా పక్కన కూర్చుంది ఎవరి కోసం వెతుకుతున్నావ్ అంటూ.

నేను మొత్తం తనకి చెప్పాను. ఆ ఆమ్మాయిని చూడటానికి వచ్చాను అని.

మరి నన్ను ఎలా మర్చిపోతావ్ అని అడిగింది.

మీ వాళ్ళ కి నేను, నా ఫామిలీ నచ్చక పోతే, నేను ఏమి చెప్పగలను. అన్నాను.

నువ్వు నన్ను వద్దు అనుకున్నా, మీ ఫ్యామిలీకి నేనే కావలిట అని నవ్వింది.

నేను ఆశ్చర్యం గా చూస్తున్నాను తననే.

హ, నిజం.. మీ బామ్మగారు వచ్చి,  నా వల్ల ఈ పెళ్లి ఆగకూడదు అని మా అమ్మ ని ఒప్పించారు. పెద్దావిడ తన మనవడి కోసం మగ పెళ్లి వారం అనే చాదస్తాలు విడిచి వచ్చి, అలా అడిగితే మా వాళ్ళు కరిగిపోయారు.

అదీ కాక, పెద్ద వాళ్ళ మాట కు విలువ ఇచ్చే నీ  లాంటి మంచి మనిషికి వాళ్ళు ఇచ్చే గౌరవం మన పెళ్లి అంది.

బామ్మ నన్ను ఆ గుడికి ఎందుకు పంపించినదో, ఇప్పుడు అర్ధం అయింది. నేను పుట్టినప్పటి నుంచీ, నాకు సంబంధించిన శుభకార్యాలు అన్నీ ఈ గుళ్ళో నే చేశారు. అదీ మా బామ్మ సెంటిమెంటు.

ఇంటికి వెళ్లగానే, సంతోషంతో మా బామ్మ కాళ్ల మీద పడిపొయాను.

ఏరా మనవడా, అంత నచ్చిందా నా మనవరాలు, అంటూ మురిసిపోయింది మా బామ్మ.

నన్ను చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు అందరూ

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!