కుటుంబ తగాదాలు

కుటుంబ తగాదాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభా కరి

   సూర్యోదయం మొదలు పూర్వం పెద్ద కోడలు, అద్ద కోడలు అంటూ వంట వార్పు అన్ని చేసేది. ఎన్ని మార్పులు వచ్చినా కుటుంబంలో ఆడపిల్ల ఉంటేనే సుఖము. కొందరు ప్రత్యేకంగా ఆడపిల్లను కొంత కాలం వరకు చూసుకుంటారు. అలాగే రమ్య నలుగురు అబ్బాయిల తరువాత పుట్టింది. వాళ్ల నాన్నమ్మ పేరు పెట్టారు. వాళ్ల నానమ్మ పేరు రమా సుందరమ్మ అల రమ్యగా మార్చారు. నట్టింట బంగారమే అనాలి నాలుగు ఎకరాలు పొలం కొన్నాడు.
కొంత లోన్, కొంత డబ్బు పెట్టీ కొన్నాడు. పిల్లకీ ఇంటర్ కాగానే పెళ్లి అన్నారు. నలుగురికి మంచి చదువులు వచ్చి విదేశాలకు వెళ్ళాలని తపన. అలా వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యి స్వశక్తి పై ఆధారపడి నిలబడ్డారు. పెళ్ళిళ్ళు చేస్తాము అంటే మాకు వద్దు, ముందు చెల్లి పెళ్లి అన్నారు. కానీ పెద్దవాడు బెంగాలీ దాన్ని, రెండో వాడు గుజరాతీ దాన్ని పెళ్ళి చేసుకున్నారు.
ఆడపిల్ల పెళ్ళి వరకు బయట పడకూడదు అనుకున్నారు. పిల్లకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. అప్పటికే బావమరిది కూతురు వేరే రాష్ట్రం అబ్బాయిని చేసుకున్నది. అందుకు రమ్యని తండ్రి వాళ్ళ ఇంటికి పంపేవాడు కాదు. పుట్టింటికి  భార్యను కొన్నాళ్ళు పంపలేదు కానీ.. ఇప్పుడు పంపుతున్నారు. ఆవేశం బిడ్డల మీద ఎంత కాలము ఉంటుంది. కన్న వాళ్ళపై అలక అంటే ఎలా? మారే కాలంతో మారకుండా ఉంటే ఎలా?
రమ్యకి కూడా మంచి సంబంధం చెయ్యండి మామయ్య నువ్వు ఎదో చాదస్తం పెట్టుకుని పెద్ద కుటుంబంలో పిల్లని పడేయ్యాకూడదు…ఆలోచించి చెయ్యండి. ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటారు. కానీ విధిరాత గొప్పది అంటారు. రమ్యకి నలుగురు చతుర్వేదముల వలే ప్రేమగా చూస్తారు. పెద్ద ఉద్యోగస్తులు కానీ ఎవరూ ఏమీ భాధ్యత పెట్టుకోరు. తండ్రినీ పెళ్లి సంబంధం మీరే చూడండి అన్నారు. కొంత మంది మా పిల్ల ఉంది మీ కొడుకులకి చేసుకో వచ్చును, కుండ మార్పిడి పెళ్లి చేద్దాము అన్నారు. అందుకే ఒక్క కొడుకు ముందుకురారు వాళ్ళకి నచ్చిన పిల్లని వాళ్ళు చేసుకుంటారు.
పెద్ద చదువు సమంగా ఎదిగిన పిల్ల కుదరాలి అంటారు. నాన్న మా పెళ్లి విషయం అందరికి తెలిసిందే. అక్కడ జీవించ గలిగె శక్తి ఉన్న పిల్లలు కావాలి. మాకు ఉద్యోగం సరిపోతుంది. ఇంటిపని, పిల్లల చదువులు చూసుకునే వ్యక్తి కావాలి. రమ్య పెళ్లి మీ ఇష్టం అన్నారు. రమ్య నీ ఉద్దేశ్యం ఏమిటి? నాన్న నేను దూర ప్రయాణాలు, ట్రాఫిక్ జామ్ లో జీవితం సగ గడిచే ఉళ్లు వద్దు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వచ్చేలా ఉండే ఊరులో వాళ్ళని చెయ్యండి అని చెప్పింది.
సరే అని.. నీ ఉద్దేశ్యం తెలిసినది. నీ ఫ్రెండ్ దూరం పెళ్లి చేసుకుని రకరకాల తిప్పలు పడుతోంది. అన్నలు ఎవరి జీవితం వారిది. సరే నీ ఉద్దేశ్యం మంచిదే, అని ప్రక్క ఊరిలో ఫ్రెండ్ కొడుకుకు విజయవాడ ఉద్యోగం చేస్తున్నా! అమ్మ, నాన్న కోసం పండగకి వస్తూఉంటారు. వాళ్ళకి చేస్తే మంచిది. సరే అని అన్నదమ్ములు ఒప్పుకున్నారు.
ఎంత పెద్ద కుటుంబమైన పిల్లల జీవితాలకి అనుగుణంగా మారవలిసిందే. ఏమి చేస్తారు మహా మహా పండితులు సహితము మార్పు రావలసిందే ఇది కాలం తెచ్చిన మార్పు. రమ్య ఆ ప్రక్క ఊరులో అత్తవారి ముచ్చట్లు పంచుకోవడం అన్ని సరదాలు అమ్మ, నాన్న జరిపారు. ఇంట్లో పనులు అన్ని అలవాటు చేసుకున్నది. సంతృప్తికర జీవితం కోసం ఎదురు చూపులు చూస్తూ, ఎక్కడో కేవలం డబ్బు కోసమే అన్నట్లు జీవితంలో కుటుంబానికి దూరంగా జీవించడం ఎంత వరకు సమంజసం అని సంపాదించుకోవచ్చు కానీ కుటుంబ వ్యక్తుల ప్రేమ ఆత్మీయతలు అందరికీ కావాలి.
మనిషి జీవిత నాటకంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి, జరుగుతున్నాయి. నానాటి బ్రతుకు నాటకము, అన్న శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనల సారాంశము మానవ జీవితానికి ఎన్నో విధాల మార్పులకు అర్థం చెపుతుంది.
జీవన గమనంలో విన్నూత్న సృష్టి ఆడపిల్ల, పెళ్లి పిల్లలు అవతలి ఇంట్లో జీవితము ఎన్ని సుఖాలు ఉన్నా పుట్టింటికి దూరంగా వెళ్ళాలి. విద్య ఉద్యోగం, భాద్యతలు, మనుష్యులను దూరం చేస్తున్నాయి. మనసులో ఎన్ని భావాలు ఉన్న పరిస్థితులు మార్పు అనే పద్మవ్యూహంలో మనిషి జీవితాన్ని ఎన్నో విధాల ఆదుకుంటుంది.
ఆర్థిక పరుగులో ఏం పరుగు పెట్టినా, ఎవరికైనా అభ్యంతరకరమైన సరే ఆర్థిక పరుగు తప్పదు. ఈ విషయం ప్రతి ఇంట్లో జరిగేదే. శాంతి శుభము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!