గురువు (సమ్మోహనాలు)
రచన: చంద్రకళ. దీకొండ
మళ్లించు మంచివైపు
మంచి దారిని చూపు
చూపును లోకతీరులను గురువు మానవా…!
తాను కరుగుతున్నా
కరిగి మండుతున్నా
మండే వెలుగు సూరీడు గురువు మానవా…!
తప్పొప్పు తెలియజేసి
తెలియనవి సరిచేసి
సరిదిద్ది తీర్చిదిద్దును గురువు
మానవా…!
గమ్యపు గుమ్మం గురువు
గురువే కదా తరువు
తరువులా పదికాలాలు నీడగా
మానవా…!!!