ఎర్రి జనం! మనం

ఎర్రి జనం! మనం

రచన: తొర్లపాటి రాజు (రాజ్)

బాబాలు.. బాబాలు..
యెన్నో.. లాభాలు!

రకరకాల అవతారాలు
తోచిన అలవాట్లు
నోటికొచ్చిన మాటలు
వెకిలి చేష్టలు

వీటన్నింటికీ..
పిచ్చెక్కిపోయే.. ఎర్రి జనాలు!
లాభాలే… లాభాలు!

వెయ్యెకరాల ప్లాట్లు..
రహస్య గదులు..
లైంగిక కార్య కలాపాలు..
వ్యాపార లావాదేవీలు..
నాయకులేమో..
సాష్టాంగ దండాలు!

అసలు… నేనెవర్నో తెలుసా?

నేనొక…
బ్లాక్ టికెట్ గాడ్ని
అమ్మాయిల బ్రోకర్ని
పిక్ పాకేటర్ని

మీ.. అందరి ఆశీస్సులతో
అయ్యా నేనొక బాబాని!
ఎవరైనా.. వదులుకుంటారా
ఇంత గొప్ప అవకాశాన్ని!

హత్యలు చేయొచ్చు..
అత్యాచారాలు చేయొచ్చు..
నాపైకి.. పోలీసులు వస్తె..
జనాలే కొట్టుకు చచ్చు!

బాబా… బాబా…
శరణం.. శరణం…

నువ్వు మాతో..
ఆడుకున్నా… మారం
మమ్మల్ని..
వాడుకున్నా… మారం
అందుకే….
మా పేరు.. ఎర్రి జనం!

ఎందరో… బాబాలు…
లాభాలే… లాభాలు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!