సత్యాన్వేషి
రచన :పసుమర్తి నాగేశ్వరావు
సత్యమే తన గుణం
అహింసయే తన సాధనం
చిరునవ్వే ఆయుధం
శాంతి మార్గమే తన సాయుధం
పొరుబంద వీరుడు
పోరు నచ్చని ధీరుడు
సత్యమేవ జయతే పలికినవాడు
సత్యాన్వేష సాధన చేసినవాడు
నిరాడంబరుడు నిత్యా స్వాతంత్ర్య సాధన శ్రామికుడు
నిరంతర సత్యసాధకుడు
సమత మమతను పెంచినవాడు
సర్వమత సాధన సాధించినవాడు
గాంధీతత్వమే ప్రపంచానికి స్ఫూర్తి
విశ్వావణిలో రెపరేలాడెను గాంధీ కీర్తి
భారతీయులకు పేరు తెచ్చెను
భారతమాతకు కీర్తి తెచ్చెను
విశ్వశాంతి కోరిన శాంతిదూత
మనం సగర్వంగా చెప్పుకునే భారత జాతిపిత