కిటికీ

కిటికీ

రచన :సావిత్రి తోట “జాహ్నవి”

కిటికీ అంటే గాలి కోసం మాత్రమే ఏర్పాటు చేసుకుందేమో అనుకుంటే పొరపాటు…
ఆకాశంలో చందమామ…
చెట్టు మీద పాలపిట్ట…
బయట నించి వచ్చే పిల్లగాలి
పక్కింటి  పడుచు పరువాలు..
కళ్లకు కనువిందు చేయిస్తుంది కిటికీ…
పక్కింటి భాగోతాలు…
ఎదురింటి గిల్లికజ్జాలు…
కొత్త దంపతుల సరస్సల్లాపాలు…
పిల్లల అల్లరి చేష్టలు…
కళ్లకు కట్టినట్లు కనిపించి…
చెవిలో దూరి మారాం చేస్తాయి…
ఊరంతా చాటింపు వేయమని…
మన ఇంటి గుట్టు బయట పడకుండా జాగ్రత్తగా కాపాడుకునే మనమే…
ఎదురింటి భాగోతాలు ఎంత తొందరగా ఊరంతా చాటుదామని వేగిరపడుతూ…
కిటికీ చాటు నుండి… గోడచాటు నుండి వింటూ…
పక్కింటి వారికి… ఎదురింటి వారికి… తగువులు పెడుతూ…
మనం వినోదాలు చుాడడానికి
వాడే సాధనంగా…
కష్టం వస్తే మనకేందుకులే అనుకుంటూ…
వీలైతే మరి రెండు మాటలతో కుళ్లపోడుస్తూ…
బాగుంటే… అమ్మో బాగుపడి
పోతున్నారేమో అని ఏడుస్తూ…
ఎలా వారి బాగును అడ్డుకోవాలా అని తలుస్తూ…
చాటు నుండి తిలకిస్తూ…
వీలైతే వారి అవకాశాలు అడ్డుకునేలా …
ఇరుగు, పోరుగు మాటలను
ఒకరివి ఒకరికి చేరవేయడానికి…
ఏసి తగిలించి… మన ఇంటి
వేడి గాలి ఎదురింట్లో పంపడానికి…
మనింటి చెత్త పక్కింట్లో వేయడానికి…
ఇన్ని రకాలుగా ఉపయోగించుకునే కిటికీ
ఒకరోజు ఏ కారణం చేతనైన
మూతపడితే  లోకమంత శూన్యం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!