విరహాన విరజాజులు

విరహాన విరజాజులు

రచన: జయ

ఏమని నే చెప్పాలి ఈ తికమకలో మకతికలో ఈ వెన్నెల రేయి ఒక పక్క, నా వాలు జడలో పురివిప్పి నాట్యమాడుతూ ఈ విరజాజుల పరిమళాలు ఒక పక్క నను నిలువనీక తెగ అల్లరి చేస్తూ నను ముంచేస్తూ మనస్సున నా మనస్సున పరదా వేసి దాచిన కొంటె ఆశలు అన్ని ముసుగు తీసి బయటకు వచ్చేలా చేస్తున్న విరజాజులు వెన్నలలోని అందాన్ని, జగతిలోని సుమగంధాలను తనలో పుదిమికొని నాలో వలపుల సరగాలు పూయిస్తూ..

నాకు నవ్వు ఓ చిరునవ్వు విసిరేస్తూ విరహన వేగే తనువుకు మోహన రాగాన్ని వినిపిస్తూ. కార్తీక వెన్నెలలో నెల రాజు సన్నిధిలో నా మది నీడగా, నా తనువున తనువుగా,ప్రాణములో ప్రాణంగా జతి చేసే జతగాడు కౌగిలిలో కరిగిపొమ్మని నను తొందరపేడుతుంటే.

ఓ సమయామా చెలింపచెయ్యకే
ఓ బిడియమా తలవంచనియకే
ఓ పరువమా తపించాకే
ఓ తీరం ఇలా తనకు తానే
వెతికి జతకి చేరి నా లోకాన్ని మొత్తం తనది గా చేసుకొని నను చంటి పాపల చూసుకుంటూ
పైడి బొమ్మల నను చూసే ఆ కనులనే
చందమామలా నాలో నింపేసుకున్న
ఆ క్షణాలలో తనలో చిలిపితనం సిరివెన్నలై ఇది గో నీ కలల వనం అని నాకు చూపుతుంటే..

ఆడజన్మలా నను గుర్తించాను నను నేనే ఆక్షణం
నాకే తెలియని నన్ను నాకే చూపిస్తూ
నాలో మైమరుపుకు కారణం అయిన తనని నా జీవితంలో కి ఆహ్వానించి తనకై నా హృదిలో
గుడినే తననే ఓ దేవుడు లా నిలిపుకొని.
నా జీవితాన్ని తనకే అర్పించాలని ఆశలు అన్ని
దోసిట నింపి తనకు ప్రేమాభిషేకం చెయ్యాలని

” మేఘాలు అన్ని సన్నంచు చీరగా మలచి
మబ్బుల చాటున దాగిన ఆ రవికిరణాని నుదిటితిలకంగా దిద్దుకొని.
ఆ మిసిమినే నా నీలి కనులకు కాటుకగా అద్ది.
నా కురులనే ఆ మరులకు విరులపానుపు చేసి
నా వయ్యారాలన్నీ నా సిగ్గుల మాటున వలపుల ముగ్గులు వేస్తూ తనకై ఎదురుచూస్తున్న ఈ రేయి మా తొలి రేయి.

తనకై ఎదురుచూస్తున్న. నేను నా విరజాజులు కు మోక్షం కల్పిస్తూ నా వాడి కౌగిలి నన్ను మోహన ఊరేగిస్తూ తను చేసిన తీపి తీపి తియ్యనైన గాయాలే నాకు జ్ఞాపకాల పందిరి వేసి తన నీడ గా నన్ను అల్లుకొని.
అధర సుధలు మధురు మై ,
నా తనువును నిలువెల్లా తడుముతూ
మంచులా నను కరిగించి
నను తనలో ఐక్యం చేస్తూ తను నాలో లీనం అవుతూ కోరికలన్నీ పగపట్టి ఇద్దరిని విరహాయుద్ధంలో ముంచేస్తే తన కౌగిలిలో తనని గెలిపించి నేను ఓడలో తెలియని ఒడిదుడుకులు లో మేము ఓ పక్క.
విరజాజులు నా చెలి కానీ కొరమీసం ధాటికి నా మొరటి మొగుడు వాడి చూపుల దాటికె నా కురుల అంచులో మెల్లగా దాక్కుని మా చిలిపి అల్లరికి తన విరహాని వెన్నలకి వదిలేసి. మురిసి మురిసి పోయి హాయిగా నవ్వుకుంది వెన్నలతోకలిసి.

మా తొలి రేయి వెన్నెలరేయి జగతిలో మా జీవితాల్లో మరుపురాని రేయు.

You May Also Like

2 thoughts on “విరహాన విరజాజులు

  1. విరహాన విరజాజులు👌👌👌👌 టైటిల్
    మన్మథ మది తలంపుకు మోక్షం కలిగించేలా
    “సరస”రస మయూరి నాట్యమాడినట్టు
    పొందికైన అక్షరాలతో అందమైన భావాల్ని విరచించారు😍🥰

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!