అప్పు అప్పుడే ముప్పు

అప్పు అప్పుడే ముప్పు

రచన: యాంబాకం

     “అప్పు ఇచ్చువాడు వైద్యుడు” ఒకప్పటి సామెత!కాని “అప్పు ఇచ్చు వాడు రాక్షసుడు”ఇప్పటి సామెత! అప్పు ఇచ్చేటప్పడు వైద్యుడే, తిరిగిఅప్పుఅడిగి నప్పుడు మాత్రం రాక్షసుడు అవతారం ఎత్తు తాడు కాబట్టి అప్పు ఇచ్చు వాడు రాక్షసుడు, కథ లో కి పోతే షరాబు కిష్టయ్య సూర్య పేట కి కొత్తగా వచ్చి స్థరపడిన వాడు. అయితే అందరూ అతనినిముద్దు గా షరాబు అని పిలుస్తారు.మొదట నుంచీ వైద్యుడు అదేనండి అప్పు ఇచ్చేవాడు అవసరం లో వున్న వారికి అధిక వడ్డీ లకు అప్పులిచ్చి,బాగా కూడ బెట్టాడు. అయితే అంతకు ముందు ఉన్న ఊళ్ళో కొంత మంది ఊరి వారు షరాబు అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదని గొడవ జరగడంతో ఆస్తులు అన్ని అమ్మి సూర్యాపేట లో స్థరపడ్డాడు.

     సూర్యపేటలో కూడా షరాబు కిష్టయ్య తన పాత ధొరణిని మార్చుకోలేదు. కాని అప్పులైతే ఇచ్చాడు. ఏదో బ్రతుకు వృత్తి కానీ, కొత్త ఊరు, కొత్త మనుషులు,వాటిని తిరిగి వసూలు చేయడం కష్టమైంది.
షరాబు అవస్థ ను గమనించిన ఆ ఊరివాడు నీ బాధ అర్థం అయింది నీకు వసూల విషయంలో సహయ పడగల వాడు ఒక్క సూర్య పేట ప్రకాశ్ రావు మాత్రమే,వెళ్ళి అతనని తో చెప్పకో అని చెప్పగా షరాబు  ప్రకాశ్ రావు ని కలుసు కున్నాడు. ప్రకాశ్ రావు మూడు తరాల నుండి సూర్య పేట శివారులోని నిమ్మ మామిడి అరటి తోపులోల పక్కనే నివాసం వుంటున్నాడు. ఆ ఊరు మార్కెట్ యాడ్ లో పరపతి ఉన్న వ్యక్తి కావడంతో అతని కి సూర్యాపేట లో పలుకుబడి ఉంది.

     షరాబు కిష్టయ్య వచ్చి పరిచయం చేసుకొని వచ్చిన పని గురించి చెప్పగా రావు ఒక పది రోజులు తరువాత కనబడమని చెప్పగా సరేనని దన్నం పెట్టి అక్కడ నుండి తన ఇంటికి పోయి పనిలో మునిగి పోయాడు షరాబు.
పదిరోజులు గడిచిన తర్వాత షరాబు రావు గారి ని కలవగా రావుగారు అప్పు తీసుకుని ఇవ్వకుండా తిప్పు తున్న వాళ్ళు పేర్లు చెప్పండి అని అడిగాడు.షరాబు వెంటనే ఎవర్నది వాళ్ళపేర్లు చెప్పగా రావుగారు ఒక్క వారం రోజుల్లో వాళ్ళ నుంచి బాకీవసూలు చేయడం గానీ, సుళువుగా వసూలయ్యే మార్గంగానీ చెప్పతానని షరాబు తో అన్నాడు.

     రెండు రోజుల తర్వాతా ప్రకాశరావు షరాబు ను అతనికి బాకీవున్న మస్తానయ్య ఇంటి కి తీసుకు వెళ్ళి అక్కడ ఏం చేయాలో చెప్పి తనకు బయట పనులు ఉన్నాయి అని వెళ్ళి పోయాడు.

     షరాబు మస్తానయ్య ని బయటకు పలిచి బాకీ విషయం అడిగాడు.

     మస్తానయ్య “ఇస్తా లేవయ్యా నా దగ్గర ఉన్నప్పుడు!”అని భయపడని వాడిలా సమాధానం చెప్పాడు.

     షరాబు అతని ని వదలకండా ఇచ్చేదాకా కదిలేదు లేదని మొండికేశాడు ఈ గొడవకు ఆ చుట్టుపక్కల వారు అంత గుమిగూడగా వీధి లో ని నలుగురు షరాబు మస్తానయ్య తగవు వినసాగారు. ఇంతలో మస్తాన య్య షరాబు ని లోనికి పలిచి”నాకు రావలసిన డబ్బు రాలేదు రాగానే తప్పకుండా నీ బాకీ అసలు, వడ్డీ, తో సహా పువ్వుళ్ళో పెట్టి తీరుస్తానయ్య!దయచేసి నా మాటనమ్ము “నీకాళ్ళకి మొక్కుతా అని ఎంతగానో బతిమాలు కొన్నారు.

     “షరాబు ఈమాట ఈ ఊరి పెద్ధ మనుషులు ముందు ఒప్పు కంటే ప్రస్తుతానికి ఆగుతాను”అన్నాడు షరాబు చేసేది లేక మస్తానయ్య పెద్దమనుషులకు వింనబడేలా షరాబు ముందు ఒప్పుకొని వాగ్ధానం చేశాడు.

     అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే మస్తానయ్య తో “క్షమించండి” మస్తానయ్య గారు!పట్నంలో గొడవలు గా ఉన్నందున నాకు డబ్బు సకాలంలో అందలేదు.నిన్ననే అందినది నేనే వద్దామని అనుకుంటూ వున్నాను. ఇంతలోపు మీ తాలూక మనిషి ఏవరో వచ్చి మీరు షరాబు కు డబ్బు ఇవ్వవలసి వచ్చిందని, వెంటనే డబ్బు తీసుకుని రమ్మటున్నారని చెప్పడంతో బయలుదేరి వచ్చేశాను. ఇదిగొండి మీకు రావలసిన మొత్తం! అని కొత్త వ్యక్తి మస్తానయ్య చేతిలో డబ్బు ఇస్తూ షరాబు కు ఇవ్వ వలసిన మొత్తం ఇచ్చేయ్యండి!అని గర్వంగాపలికాడు.

     మస్తానయ్య మొహం ‌వాడిపోయింది. నిరసనగా ఉబ్బు అందుకుని పెద్ధ మనుషుల ముందు షరాబు బాకీ చెల్లించాడు. మస్తానయ్య ఈ మధ్య నే ప‌లాన వ్యక్తి ద్వారా వ్యాపారం చేసి లాభాలు పొందుతున్నాడని అతడి నుంచి మస్తానయ్య కు డబ్బు రావాలసి ఉందని తెలుసుకొనే ప్రకాశరావు ఈ పథకంవేసి బాకీ వసూలు చేపించ్చాడు.

     షరాబు కు బాకీ వున్న మరొక వ్యక్తి కొండయ్య ప్రకాశరావు అతనిని ప్రతి రోజు వెంటాడి పరిశీలించగా అతడు ఏమి ఆధారం దొరకలేదు కానీ కొండయ్య తరచుగా ఊరి మధ్యలో ని పెద్ద భవంతి లోవుండే రామస్వామి ఇంటికి వెళ్ళి వస్తూఉంటాడు అని తెలిసింది.రావు మరి కొంత ప్రయత్నం చేసేసరికి అసలు విషయం తెలిసు కొన్నాడు.

     రామ స్వామి సూర్యపేట లో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కొండయ్య కి చదువు పూర్తి చేసి నిరు ఉద్యోగం ఏమి లేక కాలిగా తిరుగు తున్న ఒక కొడుకు ఉన్నాడు,రామ స్వామి ద్వారా వాడికి ఉద్యోగం ఇప్పంచాలని అతని ఉధ్ధేశం అందుకు రామస్వామి చేసిన ప్రయత్నం ఫలించి త్వరలో కొండయ్య కొడుకు కు రామ స్వామి ద్వారా ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

     రావు బాగా అలోచించిన తరువాత షరాబు ను పలిచి రామస్వామి ఇంటికి పోయి ఏం చేయాలో చెప్పిపంప్పేడు.

షరాబు రావు చెప్పనట్టగానే రామస్వామి వద్దకు పోయీ తనకు కొండయ్య బాకీఉన్న విషయం చెప్పి “చాలా రోజులుగా బాకీ వాయిదా వేస్తున్నట్లు దయచేసి కొండయ్య దగ్గర నుంచి నా బాకీని ఇప్పించాలని మీ మేలు మరువనని వేడుకగా. “రామస్వామి షరాబు ముందే కొండయ్య ని పిలిచి అప్పు తీసుకుని దాన్ని తీర్చకుండా తిప్పు తున్నావంటా”!రేపు నీకొడుకు కి ఉద్యోగం విప్పి ఇస్తే ఇలాగేచేస్తారా? అని అడిగాడు.

     కొండయ్య మొహం చిన్న బుచ్చుకోని అప్పటికప్పడే డబ్బు తో తిరిగి వచ్చి షరాబు అప్పు ఇచ్చేవాడు.

     షరాబు ప్రకాశ్ రావు తలివితేటలకి పొంగి “నీ సహయం నేను మరచిపోలేనిది. అయితే నా వ్యాపారం సజావుగా జరగడానికి ఏదైనా మంచి చిట్కా చెప్పమనగా దానికి రావు'”ఎన్ని చిట్కాలు ఏం చెప్పి లాభం! మన వ్యాపారం నిజాయితీ తో కూడుకుని నలుగురూ గర్వించేలా వున్నప్పుడు. ఎలాంటి చిట్కలు అనవసరం లేదు ఎదుటి వాడి అవసరాన్ని అసరాగా తీసుకొని మితిమీరిన వడ్డీ కి ఆశపడకుండా, ధర్మవడ్డీ తీసుకోండి చాలు అప్పుడు దేవుడు, ప్రజలు కాపాడుతారు అని హితవు చెప్పి నాడు.

“అంతా బాగానే ఉంది మీరు చెప్పనట్టగానే చేస్తాను రావు గారు. ఇంక ఒక బాకీ మిగిలి పోయింది దాన్ని కూడ వసూలయివుంటే బావుండేది అన్నాడు.షరాబు దిగులుగా!

     “ఎవరూ? ఆ, శివయ్య సంగతేనా? చెప్పేనుకదా! పాపం అతనిని వదిలే వాళ్ళు తమ్ముడు తో గొడవపడి పంతానికి పోయి చాలా దెబ్బ తిన్నాడు అన్నాడు రావు, బాకీ పూర్తిగా వదులు కోవాలాఅన్నడు షరాబు చాల సన్నని గొంతుతో.

రావు కాసేపు అలోచించి నీకు ముండి బాకీలన్ని వసూల చెప్పించాగదా అందుకు నాకు ఇచ్చే ఫీజు ఇవ్వలికదా అది నాకు వద్దులే కానీ దానిని శివయ్య బాకీకింద తీసుకో””అనగా!

     రావు ముఖంలో చూసిన షరాబు కు తెలివి వచ్చినట్లు అయింది. అంతేకాదు అప్పటి కప్పుడు రావు గారి పై గట్టి నమ్మకం కలిగింది షరాబుకు అలా ప్రకాశ్ రావు సహాయంతో సూరపేటలో వడ్డీ వ్యాపారం న్యాయమైన వడ్డీకి అప్పులు ఇస్తూ సూర్య పేట లో స్థరపడ్డాడు షరాబు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!