అక్షరం

అక్షరం

రచన: శిరీష వూటూరి

అక్షరం నాది
చిన్నపుడు ఓనమాలు
దిద్దినపుడు తెలియలేదు
నాతో ఇంతటి ఆత్మీయబంధం
పెనవేసుకుంటుందని..
నాలోని అనంతమైన భావాలకు
ఇంత మంచి రంగులద్ది
ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలను
ఆవిష్కరింపచేస్తుందని…
తెలుగులోని వెలుగులన్ని
నా కవితా కుసుమాలుగా
తీర్చిదిద్ది వర్ణమాలతో తనను
సింగారించుకుంటుందని..
నాకు నన్ను కొత్తగా పరిచయం
చేస్తూ తన ప్రయాణాన్ని
నిత్యనూతనంగా రూపుదిద్దుకోవాలని
ప్రయత్నిస్తోందని…

అక్షరం నాది
నా కలలకు నాంది
నా కలానికి పునాది……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!