వయోవృధ్ధులు

వయోవృధ్ధులు

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

వయోవృధ్ధులు వారు
వయసుడిగినవారు
జీవితచరమాంకంలోకి అడుగిడినవారు
అనుభవాలతో పండినవారు
అందరికి భారమైనవారు
అందరూ చీదరించుకునేవారు
ఆదరణకరువైనవారు
అనాధలుగా అనాధాశ్రమములో గడుపువారు
అందరూవున్నా ఆదుకునేవారులేరు
కన్నబిడ్డలను కలెక్టర్లను చేసినవారు
ఎక్కడోదూరంగా కన్నబిడ్డలుంటారు
ఇక్కడ వీరు మాత్రం ఒంటరివారే
కాళ్ళునొచ్చినా కేన్సరొచ్చినా కాచుకునేవారుండరు
సంపదలను పంచుకోవడానికి కాకుల్లావాలిపోతారు
కడచూపకైనా చూడడానికిరారు
కర్మకాండలైనా చేసేది పైవారే
వయోవృద్ధులు వారు
వయసుడిగినవారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!