మహాలక్ష్మి

మహాలక్ష్మి

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

శుక్రవారం మహాలక్ష్మిగా మా ఇంట
కల్పవల్లి రూపంగా నిలచె మా కంట
కర్పూర హారతి సమర్పించెదమంట
శుభాలను మాకై ప్రసాదించునంట

శుచిగా మనసును మార్చుకుని
రుచిగా నైవేద్యాలను వండుకుని
దీపారాధనతో ఇంట వెలుగు నింపుకుని
మానసిక ఆనందంతో తల్లిని ఆరాధించు

పచ్చని పసుపు కాళ్ళకు పూసుకుని
ఎర్రటి తిలకం నుదుటన దిద్దుకుని
మంగళతోరం కుడి చేతికి కట్టుకుని
తాంబూలాలు పూజకై అమర్చుకుని

నిండు మనసుతో ఆ దేవిని కొలువు
డబ్భు వ్యయం, హంగులు కాదు ప్రధానం
మనసులోని భక్తి భావం ముఖ్యం
అమ్మని ఆరాధిస్తే చేరుకోవచ్చు నీ గమ్యం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!