ఆదర్శప్రాయుడు 

ఆదర్శప్రాయుడు 

రచయిత: వి. కృష్ణవేణి

  లోకాన్ని సృష్టించే బ్రహ్మకన్నా నాన్నంటే నాకిష్టం….

బరువు భాద్యతలు తన భుజాన్నామోస్తూ   .

ఎండనక వాననక శ్రమించి మాకు నీడనిచ్చే నాన్నంటే నాకిష్టం..

అమ్మకష్టం లో పాలు  పంచుకుంటూ..

ఆమె ఇష్టంలో తృప్తిని చవిచూస్తూ…

నవ్వుతూకనిపించే నాన్నంటే నాకు మరీ ఇష్టం…

తన పౌరుషాన్ని కనబడనీయకుండా తప్పటడుగుల మధ్య సాగిపోయే..

తనతపనని చూస్తే నాన్నంటే మరీ ఇష్టం..

నాన్నమ్మ కొంగుముడివిప్పుతుంటే.

నాన్న చిన్నప్పటి ముచ్చట్లు, .

ఆమె కళ్ళలోని పాతస్మృతులు వెలుగుచుస్తుంటే…

నాన్న ఆదర్శమే నాకు గర్వం  నాన్న జీవితం ఒక పునీతం..

నాన్న జ్ఞాపకం తరగని  నిదర్శనం..

నాన్న ప్రేమ మరపురాని మధురగీతం..

తరతరానికి నాన్న నిరంతరం .

మనిషి పుట్టుకకు నాన్న ఒక వరం….

సృష్టి   ఆది అంతాలను చూడతరముకాదుగాని…

నాన్న   హృదయాన్ని చవిచూడగలము  …

నాన్న అన్న పిలుపు వెన్నతో పెట్టిన విద్య…

జనన మరణాల  మధ్య  నాన్న జీవితo ఒక మిధ్య..

                                        ***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!