ప్రేమ బంధం

ప్రేమ బంధం

రచయిత:సిరి

దూరం దగ్గరైన వేళ…
మాటలు మౌనం వహించాయి!
మనసులు సంభాషించుకుంటున్నాయి…
ఎద సవ్వడి గొడవ చేయసాగింది…
తనువులో కోరిక లేదు ఆ తపనలో ప్రేమ తప్ప..!
ఒకరి ఊపిరి మరొకరికి కావాలి అని
శ్వాస భారం గా మారింది..!

ఒకరి ఎద సడి మరొక సడితో చేరాలి అని…
గుండెలు రెండు నిశబ్దంలో శబ్దం గా మారాయి!

మనుషులలో ఆవేధన లేదు… మనసులో ప్రేమ తప్ప!
తనువులు ఏకం అవ్వన అవసరం లేదు…!
మనసులు ఎప్పుడో ఏకం అయ్యాయి…!
మనసుతో ముడి వేసుకుంది ఈ బంధం..
అది చాలదా ఆ ప్రేమ కి !

ఆ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసినా…
ఇక బాధ లేదు ఆ శరీరాలకి!!

 

 

You May Also Like

6 thoughts on “ప్రేమ బంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!