గుండెకొక తీపి మరక మిగిలింది

గుండెకొక తీపి మరక మిగిలింది

నిను చూసాకా నా కళ్ళు వేరే ఏమీ చూడనని మారాం చేస్తున్నాయి..
చూడకపోతే.. ఇక చూపెందుకని నిలదీస్తున్నాయి..

నీ కన్నెత్తి ఒక్కసారైనా చూస్తావేమో అని వేయి కన్నులతో ఎదురుచూశా..
నీ కంటి చూపు శూలాల్లా గుచ్చుతాయని తెలీక..
నీ చూపు తగిలిన చోట.. గుండెకొక మరక మిగిలింది..
మరక మంచిదేగా..

అరెరే.. ఇంతలోనే ఇన్ని చీమలు ఎలా వచ్చాయ్..
బహుశా నా మనసులో నీ తీపి జ్ఞాపకాల వరద వలన కాబోలు..

సమయం.. నువ్వు..
రెండూ భిన్న దృవాలు..
నువ్వుంటే సమయం తెలీదు..
నువు లేనపుడు ఆ సమయమే భారం..

భారమైన క్షణాలను లెక్కెట్టుకుందామని నీ మనసు చెంత చేరా.. కొన్ని అడుగుల దూరాన..

నీ రెండు పాదాలు నా రెండు పాదాల వద్దకు వచ్చి ముని వేళ్లపై నిల్చున్నాయి..
చూపులు కనురెప్పల మాటున దాక్కున్నాయి..
రెండు పెదాలూ మరో రెండు పెదాలతో మురిపాలు ముచ్చటించుకుంటున్నాయి..

గాల్లో చక్కర్లు కొడుతూ తేనెకై గాలిస్తున్న ఓ తేనెటీగ..
పొరపాటున నీ పెదవి పైనున్న తేనెని గ్రోలినదేమో..
పాపం ఆ చిరు అధరం..
అదురుతోంది.. వణుకుతూన్న చలిని కూడా వణికించేలా..

ఒకరి నిశ్వాస.. మరొకరి శ్వాసలో చేరింది
కాలం ఆగింది.. గుండె వేగం పెరిగింది..
ఒకటే ప్రాణధార.. రెండు దేహాలు..
రెండు గుండెల సంగీతం శ్రావ్యంగా వినబడుతోంది..
మన మనసుల శబ్దం నిశ్శబ్ధమైంది..

వర్షపు జల్లులు కురిసి ఆగినాక వాన విల్లు విరుస్తుంది..
కను చివరన నిలిచిన ఆనందపు కన్నీటి బొట్టు సంతోషపు మరక మిగిల్చింది
అదోలోకం.. మరో ప్రపంచం..

రచయిత:పాండు రంగాచారి

You May Also Like

13 thoughts on “గుండెకొక తీపి మరక మిగిలింది

  1. అర చేతిలో చందమామ , ఆ చందమామే నిన్ను చూసి సిగ్గు పడదా…
    కవిత బాగుంది మాస్టారు
    సినిమా లో వాడితే బాగుంటుంది

  2. Premani chala premaga vyaktham chusaru… Muddunu muddu muddu matalatho nimpesaru… Chala bagundi me Kavitha…

  3. నిజంగా మరో కొత్త లోకం లో విహారించినట్టు ఉంది చదువుతున్నంతసేపూ…..nice lines 👌👌

  4. Chala baaga raasaru ….chavutunna koddi ado kotta prapanchamlo veltunnam ane feeling kaligutundi

  5. Chala bagundhi sir thipi gnapakala varadha valana chimalu pattayi aa upamanam Chala Chala bagundhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!