గుండె గుడిగంటలు

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

గుండె గుడిగంటలు

రచన: చంద్రకళ. దీకొండ

పైకి అనలేని మాటలు…
అనకూడని మాటలు…
ఊరుకోమని నోరు నొక్కేసేవి…
నీతి ప్రభోదాలు…
ఇలా చేస్తే బాగుంటుంది…
నువ్విలాగే ఉండాలి…
ఇలాగే చేయాలి…;
లోపల అనుకునేదొకటి…
పైకి పలికేదొకటి…!
పౌరాణిక సినిమాల్లో చూపించిన…
అద్దంలోని వ్యక్తి అంతరంగ సంభాషణలు…
సాంఘిక సినిమాల్లో చూపించిన
ఒకే వ్యక్తి రెండు రూపాలు…
ఎంత చక్కగా సంభాషణను, సంఘర్షణనుచిత్రీకరించేవారో…
చివరికి మంచో…చెడో…పాత్ర…
ఒకదాని నోరు నొక్కి
బయటికి వెళ్లిపోవడం…
ప్రేక్షకులకు చక్కగా అర్థమైపోయేది…!
నేటి సినిమాల్లో…
సంఘర్షణ అనేదే లేదు…
లోపలి మనిషి పీక నొక్కి
అనుకున్నది చేసేయడమే…!
మనిషి లోపలి సంభాషణ…
వింటే అందలానికి…
వినకపోతే పాతాళానికి…!
ఆలకించినవాడు మహాత్ముడౌతాడు…
పెడచెవిన పెట్టనివాడు పుణ్యాత్ముడౌతాడు…
పట్టించుకోనివాడు దురాత్ముడౌతాడు…!
ప్రతి మనిషిలోని ధర్మ దేవాలయంలో
మోగే గుడిగంటలు వినాలి…
ధర్మ పథాన నడవాలి…!!!
****************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!