శశిరేఖా పరిణయం  

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
శశిరేఖా పరిణయం  

రచన:: రాధఓడూరి

ఓసి నీ యిల్లు బంగారం కానూ…

“అక్కా! అనూప్ ని పెళ్ళి చేసుకోనని రేఖ ఖరా ఖండిగా చెబుతోంది. వాడికి వేరే సంబంధం చూసి పెళ్ళి చేయి” అన్నాడు గిరిధర్ అక్క శారదతో.

తమ్ముడి మాటలు విని పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకొని “కారణం ఏంటిరా! మనం ఎప్పటి నుంచో అనుకున్నాం కదా!”

పక్క గదిలో ఉన్న రేఖ వీరి మాటలు విని వారి దగ్గరకు వచ్చింది.

నవ్వుతూ అత్తయ్య భుజం మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ “అత్తయ్యా! అనూప్,నేను చిన్నప్పటినుండి కలిసే పెరిగాము కదా. మా ఇద్దరిలో ఏ ఓక్కరికీ మేము పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనే లేదు. తను కూడా చెప్పాడు కదా! ” అంటూ శారద కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్ళని ఆప్యాయంగా తుడిచింది.

శారద రేఖ కి దూరంగా జరుగుతూ “ఏదో నా తమ్ముడి కూతురువి కదా! నా కోడలవుతుందని నా పుట్టింటి ప్రేమలే అది. ఇక నేను వెడుతున్నాను” అంటూ అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోయింది.

శారద కారులో కూర్చుందే కానీ మేన కోడలు రేఖ మీద పీకల వరకూ కసిగా ఉండి మనసులో ‘దీని సిగ తరగ. ఎవడు పెళ్ళి చేసుకుంటాడో వాడు బికారిగా అవుతాడు’ అనుకుంది.

***

రెండు నెలల తర్వాత
శశిరేఖా పరిణయం
శిశిధర్ వెడ్స్ రేఖ

శారద ఇప్పటికి పది సార్లు చదివి కసిగా తిట్టుకుంది రేఖని.

గిరిధర్ రేఖని తన బాబాయి కూతురు పెళ్ళి లో చూసాడు. మెుదటి చూపులోనే నచ్చి తన బాబాయి చేత రేఖ సమాచారం సేకరించి పెళ్ళి వరకూ తీసుకెళ్ళాడు.

పెళ్ళి ఇల్లు సందడిగా ఉంది. గిరిధర్ తరుపు వారు రేఖ తరుపు వారు కలిసి అంత్యాక్షరి మెుదలుపెట్టారు. వారిలో అనూప్ కూడా ఆనందంగా పాల్గొన్నాడు తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న రమ్యతో.

ఇంతలో

“అమ్మో! అమ్మో! మా అమ్మమ్మ నుంచి నా దగ్గరకు వచ్చిన చంద్రహారం ఇప్పుడు పోయింది. అనుకుంటూనే ఉన్నాను…ఈ పెళ్ళిలో దొంగలున్నారని” అంటూ కింద కూర్చిని ఏడవడం ప్రారంభించింది.

“నా కోడలికి ఇద్దామనే లోపే నా చేయి జారిపోయింది” అంటూ అనేలోపే “అత్తా! ఇదేనా నీది!?” అంటూ రేఖ అత్త మెడలో వేసి ” అయినా హారం మెడకి ఉండాలి లేదా నగల పెట్టెలో ఉండాలి. కానీ ట్యాప్ కి కాదు” అంది నవ్వుతూ.

అప్పుడు గుర్తుకువచ్చింది శారద కి స్నానం చేసేటప్పుడు ట్యాప్ కి తగిలించి మరచిపోయానని.

వస్తువు దొరికిందని ఆనందంలో రేఖ తన చేతికిచ్చిందనే సంతోషంతో ” ఓసి నీ యిల్లు బంగారం కానూ! నేను మరచిపోయినా నాదని తెలుసుకుని ఇచ్చావు. సంతోషం రా అంటూ రేఖ బుగ్గ మీద ముద్దు పెట్టింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!