సగటు మనిషిని

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

సగటు మనిషిని

రచన: దాకరపుబాబూరావు

లోలోనఆలోచన్లుఎప్పుడు తప్పటడుగులు
వేసినా
అంతరంగం ధర్మక్షేత్రమై ప్రశ్నిస్తూనేఉంటుంది…

లోకం పోకడలుఎరిగిననవీన కాలపు మనిషినికదా…?!
లౌక్యంగా అంతరంగపు గొంతు నులిమేసికాలంగడిపేస్తూఉంటాను….

స్వార్ధపువలవిసిరేస్తూ నామట్టుకు నేను
బ్రతికేస్తే చాలనుకున్నప్పుడల్లా….

తప్పని గద్దించే హృదయ ధర్మ పీఠాన్ని
లెక్కచేయక ముందుకెళ్లి పోతున్నఆధునికమానవుణ్ణి నేను….

ఎదురుగాఏనేరం జరుగుతున్నా ఏ ఘోరానికి ఏ అబల బలౌతున్నా
సెల్ఫీలు తీసుకునే వైకల్యం ఉన్న నన్ను మనస్సాక్షి గద్దించనిదెపుడు..?అంతరంగంప్రశ్నించనిదెపుడు. ?

కులం పేరుతోనో…మతం మమకారం తోనో ఓటును అమ్ముకుంటూ…

లాభనష్టాల లెక్కల్ని బతుకు లెక్కలుగా గణించుకుంటూ సోకాల్డ్ బ్రతుకుగా జీవితాన్నిమార్ఫింగ్ చేసుకునే నన్ను….

కళ్ళ ముందు జరిగే ప్రతి దుశ్చర్యా
అతివల పై అకృత్యాలూ
కనిపించే ప్రతి అవినీతి కుంభకోణమూ..

నా మనో వేదిక మీద ఓటరుగా నన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి….

కానీ,జీవితపు వైకుంఠ పాళీ ఆటలో స్వార్థంతోనాపబ్బం నేనుగడుపుకుంటూ ..*మనీషి* ఆట సరిగాఆడలేకపోతున్నసగటు మనిషిని నేను…

………………………………………..

You May Also Like

2 thoughts on “సగటు మనిషిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!