అరచేతిలో చందమామ

అరచేతిలో చందమామ

బాల రాముడిలా మారాం చేస్తే, ఆ చందమామ అదే వస్తుందిలే,

అనుకున్నా పసి వయసులో!

ఏడెనిమిదేళ్ల వయసులో పెద్దలు నవ్వుతూ, ఏనాడో అమెరికా వాళ్లు చందమామ మీద కాలు పెట్టేరంటే కళ్ళు
పెద్దవి చేసి విన్నా!

కొంత పెద్దయీ ఎంత తెలిసినా కొంటెతనం, అల్లరి ముదిరీ, పడవ
ప్రయాణం సగం‌లో,  నింగిలోని‌ చంద‌మామ నీడని నీటి లోకి తోసి, నీటి లోంచి ఆ జాబిలిని వల‌వేసి పట్టేయాలని తొంగి తొంగి చూసా!

చందమామ నిండుగా నవ్వులతో చెప్తొంది  “నింగిలోనయినా నీటిలోనయినా నువ్వు ప్రకృతితో అవగలగాలి సుమా మమైక్యం”
అప్పుడే చందమామ చిక్కినంత ఆనందం!

నా మనసుకీ తెలుసు అసలు నిజం !

రచయిత:మంగు కృష్ణకుమారి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!