పెనవేసిన బంధాలు

పెనవేసిన బంధాలు

రచయిత: అయితగాని జనార్దన్

సింధూరం సింగారించుకొని..
సప్త వర్ణాలను పులుముకొని
కిరణాలే అభరణాలైన అరుణుడు…

మంచు ముత్యాలను మెడలో వేసుకొని
పగడాల రంగు పులుముకొని
అలల పరుపుపై పవళించే కమలం..
ఏ వింత బంధమో.. పెనవేసుకున్న
దూరం తెలియని అనురాగం..

నిశీధి కెరటం, శూన్యాకాశం
పండు వెన్నెల పరువాల కన్నెలా..
ఆకాశానికే అందగాడు చంద్రుడు

చిరుగాలి సెలయేరు
మీనా లే మైనాలు
గుండెల్లో పున్నమి
కలలు కనే కలువ..
ఏ సౌందర్య  బంధమో
కిరణ తపమో..
పెనవేసి ముడివేసింది..

మనసు పొరల్లో మధువు
వయసుకొచ్చిన వధువు
పరువాల పూరెమ్మలు
తడి రేపుతున్న పుప్పొడి గుమ్మలు
అతిధి కై వేచి చూసే సుమబాలలు

తన చప్పుడే కోలాహలం
తన తోకలో హాలాహలం
మనసు పొరల్లో అమృతం
మధించే మదన మూర్తి
భ్రమల భామ భ్రమరం

ఏ బంధం కలిపెనో..
రేపటి ప్రకృతి పరవశానికి
ఆస్కలిత సంయోగం..

నీలి నింగిలో నిండు మబ్బులు
కెరటాలు కిరీటాలుగా సంద్రం
వడగాలి నిట్టూర్పుల వేదన
గగనం గర్జించి గాలికి గురువయ్యే

ఏ స్నేహబంధమో చల్లని చినుకయ్యింది..
ప్రకృతిలో మొలకయ్యింది

పుడమి నిండా అందాలే
ఇంచు ఇంచులో బంధాలే
ఒకరి కొకరు.. ఒకరితో ఒకరు
దూరం తెలియని అందాలు
పెనవేసుకున్న బంధాలు

***

You May Also Like

One thought on “పెనవేసిన బంధాలు

  1. భావుకతను ఒలికించిన రచన.అభినందనలు జనార్దన్ గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!