చిరుసవ్వడి

చిరుసవ్వడి

శిథిలమైన నా మనస్సులో.
నీ ప్రేమ అనే పునాది వేసి.!!

నా ఎదనే  అతఃపురముగా మలుచుకొని!!

మధుభావాల మల్లె  పందిరి నీడలో,
లతవై నన్ను అల్లుకొని.!!

తడి ఆరాని నీ పెదవుల తడి
నా పెదవులకు రుచి చూపి.!!

నా శ్వాసలో ఆశల వేగాన్ని పెంచి.!!

నను నిలువెల్లా నీ మాయ ప్రేమలో ముంచేసి.!!

నువ్వు చిలిపి నవ్వులు నవ్వితే ఎలా?

మౌనంగా ఉన్నా నా ప్రేమ కు మాటలు నేర్పి.!!
నువ్వు మౌన ఋషి లా మారిపోతే.!!

నీ మాటల చిరుసవ్వడి లేక.!!
నీ ముసి ముసి నవ్వుల నగవులు లేక.!!

పండు వెన్నెల అయినా అమావాస్య లా,
కనిపిస్తుంది  నా కళ్లకు.!!

నీ కన్నుల్లో నా రూపం చూడక,
నా నీడ కూడా నామీద అలిగి.
నావైపు రానంటే..
ఏమి చెయ్యాలి..
మనోహర.!!

రచయిత:-జయకుమారి

You May Also Like

2 thoughts on “చిరుసవ్వడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!