ముద్దుబిడ్డ

(అంశం:చందమామ కథలు)

ముద్దుబిడ్డ

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

రోడ్డు మీద నడుస్తూ వెళుతున్న నాకు,  దూరంగా మేడం అన్న పిలుపు వినిపించి వెనుదిరిగి చూశాను.

ఎదురుగా నా పాత విద్యార్థి విస్వాక్ నడుస్తూ నా వైపు వస్తున్నాడు.

హాయ్ విస్వాక్ ఎలా ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు అయింది నిన్ను చూసి అని పలకరించాను నవ్వుతూ.

బాగున్నాను మేడం. పీజీ కంప్లీట్ చేసి,  ఈ ఊర్లోనే జాబ్లో సెటిల్ అయ్యాను అని చెప్పాడు.

ఓ ఓ ఇంకా ఏంటి విశేషాలు,  అందరూ క్షేమమేనా!!!

మీ నానమ్మ,  తాతయ్య ఎలా ఉన్నారు?

ముఖ్యంగా మీ నాన్న ఎలా ఉన్నారు? అమ్మ, నాన్న వాళ్ల పరిస్థితి ఎమైనా మెరుగుపడిందా?

అమ్మ లో ఎమన్నా మార్పు వచ్చిందా?

నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? లేదా పెళ్లి ఏమైనా అంటూ ఆగాను.

లేదు మేడం,  పెళ్లి కాలేదు.  కానీ నా తప్పు నేను తెలుసుకొని మా అమ్మను నా దగ్గరికి తెచ్చుకున్నాను అని చెప్పాడు.

నేను చాలా ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు మీ అమ్మతో కలిసి ఉంటున్నావా?  అని అడిగాడు ఆశ్చర్యంగా.

అవును మరి అది అంతగా ఆశ్చర్య పడవలసిన విషయమే.  ఎందుకంటారా!!!!  అమ్మ పేరు చెప్తేనే అసహ్యించుకునే వాడు,  అమ్మ అని పేరు పలకడమే ఒక పాపంగా భావిస్తాను అని ఖరాఖండీగా చెప్పిన విద్యార్థి వాడు.

మీరు ఎన్ని మంచి విషయాలు చెప్పినా వింటాను.  కానీ అమ్మ గురించి మంచిగా చెప్తే మాత్రం నేను అంగీకరించను.  అంత అసహ్యం నాకు అమ్మంటే అంటూ ఆ ఒక్క విషయంలో నా మాటకి మొదటగా ఎదురు చెప్పి, అంత చిన్నతనంలోనే తన అభిప్రాయం బయటపెట్టిన రెండో తరగతి విద్యార్థి వాడు.

వాడు అలా మాట్లాడిన ఆ రోజు, నా మనసుకి పెద్ద గాయం అయింది.

చదువులో ముందు ఉండే విద్యార్థి.  ఆటల్లో చురుకుగా,  చదువులో హుషారుగా, ప్రతి విషయాన్నీ నాతో పంచుకుంటూ ఉండే ఆ విద్యార్థి అంటే, నాకు మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

ఒక రోజు…. ఆ రోజు  నేను తరగతిలో పాఠం చెబుతుండగా,  ప్యూన్ వచ్చి,  మేడం న్యూ అడ్మిషన్.  మీ క్లాస్ లో కూర్చోపెట్టమన్నారు ప్రిన్సిపాల్ మేడం అని చెప్పాడు.

సంవత్సరం మధ్యలో ఇప్పుడు అడ్మిషన్ ఏంటి???? ఎవరా స్టూడెంట్ !!!! మన స్కూల్ బ్రాంచి నుంచే వచ్చాడా!!!@  అని అడిగాను.

హా మన బ్రాంచ్ నుంచే  మేడం.  ఏదో కుటుంబం గొడవల  వల్ల ట్రాన్స్ఫర్ చెయించుకుని ఇక్కడికి వచ్చాడు, అని చెప్పాడు ప్యూన్.

సరే తీసుకుని రా,,,,  స్టూడెంట్ ఎక్కడ? అన్నాను.

విశ్వాక్ ని తీసుకొనివచ్చి,  నా క్లాస్ లో దింపి  ప్యూన్ వెళ్ళిపోయాడు.

ఆ రోజే కనిపెట్టాను వాడిలోని చురుకుతనం. ఆ రోజే కనిపెట్టాను ఆ కళ్ళలోని పెద్దరికం, తనదైన హుందాతనంతో…  తరగతిలో అందర్నీ  ఇట్టే ఆకట్టుకున్నాడు.

ఒకరోజు నా  తరగతి లో ఇన్స్పెక్షన్ అని చెప్పి ఒక కొత్త సార్ వచ్చి,  పిల్లల్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.  అసలే చిన్న పిల్లలు. అందులోనూ కొత్త వారి ముందు మాట్లాడటానికి కూడా భయపడతారు కదా!!!!

అలాంటిది ఒక ప్రశ్నకి వాడు మాత్రమే తనదైన శైలిలో చురుగ్గా సమాధానమిచ్చాడు విశ్వాక్ ఆ నాడు. ఆ రోజే నాకు అనిపించింది వీడు అందరిలాంటి పిల్లవాడు కాదు అని.

తర్వాత కొన్ని రోజులకు,  వాళ్ళ నానమ్మ విశ్వాక్ ను  వెంటబెట్టుకుని వచ్చి, వాడికి కావలసిన పుస్తకాలు,  కుట్టవలసిన యూనిఫొరం లు,  కొనవలసిన ఇతర వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఎందుకు వాళ్ళ నాన్నమ్మ వచ్చారు అని నాకు అనుమానం వచ్చింది. సాధారణ పిల్లలని స్కూల్ కి పంపించేటప్పుడు,  వాళ్ల అమ్మ నాన్న కలసి దింపటం అలవాటు.

అలాంటిది ఇన్ని రోజుల తర్వాత, వాళ్ళ నానమ్మ తో   వివరాలు చెప్తుంటే,  నా మనసు ఎందుకో బాధగా మూలిగింది.

కానీ నేను బయట పడటం సభ్యత కాదు మనసుని నెమ్మదిగా ఉంచుకుని,  అన్ని వివరంగా చెప్పాను.  ఆ వయసులో ఆమె మనవడు మీద చూపే ఆ  ప్రేమ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

అంత ప్రేమ,  అంత ఓర్పు ఎలా వచ్చాయో ఆవిడకి ఆ వయసులో అనుకునేదాన్ని.

నా మీద నమ్మకం కుదిరిందో, లేక నన్ను చూస్తే చెప్పాలనిపించిందో  గాని…  వాళ్ళ కొడుకు,  కోడలు మధ్య గొడవల సంగతి నాతో ఏకరువు పెట్టుకుంది ఆవిడ.

వాళ్ళ కొడుకు అమాయకుడని,  వాళ్ల  కోడలు మాత్రం చదువుకున్న మూర్ఖురాలు అని చాలా దుర్భాషలాడింది. ఎందుకంటే  పెద్ద వాళ్ళ ఆస్తి గొడవల వల్ల తన కాపురాన్ని నాశనం చేసుకొన్నది అని చెప్పింది.

నాకు భాద కలిగించిన విషయమేమిటంటే…  విశ్వాస్ కి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడట.  వాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడట. అమ్మమ్మ తాతయ్య తో కలిసి ఉంటాడు.

విశ్వాస్ మాత్రం నానమ్మ,  తాతయ్య లతో వాళ్ళ నాన్నతో  కలిసి ఉంటాడు.

ఏ పండగలప్పుడో,,  ఫంక్షన్స్ అప్పుడో మాత్రం వాళ్ళ తమ్ముడిని కలిపి, ఇద్దరూ కలిసినప్పుడు వాడి తో ఆడినప్పుడు… ఆ తమ్ముడు గురించి చెప్పుకో వడంలో  గమనించాను ఆ కళ్లు మెరవటం.ఆ ఆనందం ఆ కళ్ళల్లో తాండవిస్తుంది ఆ సందర్భంలో…

అప్పుడు అర్థమైంది నాకు వాడికి కుటుంబం అంటే ఎంత ఇష్టమో!!!! మనసులో ఇష్టం ఒకటే కాదు … వాడు వాళ్ళ అమ్మానాన్న వాళ్ళని,  వాళ్ల తమ్ముడిని  ఎంత మిస్ అవుతున్నాడో కూడా అప్పుడే అర్థమవుతుంది.  గమనించే వాళ్లకు.

అంతేకాదు,  పండగల సమయంలో మాత్రం అమ్మమ్మ,  తాతయ్య… ఇటు నాయనమ్మ,  తాతయ్య కూడా  పిల్లలిద్దరికీ బట్టలు తీసుకొని …. పండగ అందరూ కలిసి జరుపుకుంటారు.. కానీ… వాళ్ళ అమ్మానాన్నలు మాత్రం వేరువేరుగా ఉండిపోయారు.

ఏవో పెద్దవాళ్ల గొడవల వల్ల విడిపోయిన అమ్మానాన్నల కలసి పంచే ప్రేమకు దూరమైన పసికందు వాడు. ఎంత మనం ప్రేమను పంచినా కూడా…. అమ్మానాన్నల ప్రేమకు దూరమైన పిల్లలు…  జీవితంలో ఎంతో కోల్పోతారు అనే చెప్పాలి.

అందమైన వారి బాల్యాన్ని దూరం చేసిన ఈ గొడవలు…  వారి జీవితంలో వారు కోల్పోయిన దానికి ప్రతీకలు. ఎన్నటికీ తిరిగిరాదు ఈ బాల్యం.

వాడి అభిప్రాయం మంచో, చెడో నాకు తెలియదు.  కానీ,  వాడికి ఎలా చెడుగా మాటలు చెప్పి ఆమెని మనసులోకి రానివ్వకుండా చేసిన వాళ్ల నాన్న వైపు పెద్దవాళ్లు అంటే మాత్రం నాకు చాలా కోపం వచ్చింది.

అలా అని వాళ్లు కూడా ఏమీ చెడ్డవాళ్ళు కాదు. పిల్లాడి బాధ్యత నెత్తిమీద వేసుకొని మరీ,  పెద్ద వయసులో చిన్నవాడిని సాకుతూన్న మంచి మనసున్న వాళ్లే.

అటు అమ్మమ్మ,  తాతయ్యల ఏకైక కూతురు వాళ్ళమ్మ.  అతి గారాబం తో,  అల్లారుముద్దుగా పెంచుకున్నారు.  తన కూతురికి మనసుకు నచ్చని పని ….. అత్త వాళ్ల ఇంటికి వెళ్ళటం.

గారంగా పెంచుకున్న కూతుర్ని  మందలించలేక, వారి  వివాహాన్ని నిలబెట్టలేక, వారి కాపురాన్ని సరిదిద్ద లేక నానా అగచాట్లు పడ్డారు.

కానీ ఏం చేస్తావు…. నువ్వు పిల్లవాడిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో …. అని చెప్పలేకపోయారు అదే వారు చేసిన తప్పు.

పెద్దవాళ్లు చేసిన  ఆ తప్పు వల్ల,  రెండు బాల్యాలు..  ప్రేమ కోసం తపించి పోతున్నాయి అని వారికి అప్పుడు అర్థమవ్వలేదు.

ఆ నలుగురు పెద్దవాళ్లలో…  కనీసం ఒక్కరైనా వీరి బాల్యం గురించి…. వీరికీ కలిగే ప్రేమరాహిత్యం గురించి,  చిద్రమైన వారి బాల్యం గురించి ఆలోచించి ఉంటే …. ఆ అన్నదమ్ములు ఇద్దరికీ ఒక అపురూపమైన బాల్యం తిరిగి వచ్చేది.

వీరి భాల్యంతో పాటుగా,  వీళ్ళ అమ్మ నాన్న కూడా వారి వారికి లభించిన అపురూపమైన జీవితాన్ని,  చేతికి అందివచ్చే అమూల్యమైన జీవితం లో భాగాన్ని చేతులారా వారే నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితానికి వారే చితి పెట్టుకున్నారు.

ఆలుమగలు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా కొంచెం ఓర్పు ఉంటే ఈ పరిస్థితి వాళ్ల కుటుంబానికి వచ్చేది కాదేమో అనిపిస్తుంది.

ఏది ఏమైనా కానీ లేదా… పరిస్థితుల ప్రభావమో, భావంలో తేడానో… ఏమో కానీ చిన్నపిల్లాడి జీవితంలో అది ఒక మరుపురాని కలకలం రేపింది.

పెద్దవాళ్ల మనస్తత్వాల్లో ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ,  చిన్నపిల్లల్లో ఆ భావనతో వేరే వ్యక్తులకు దూరం చేయడం అన్నది మాత్రం వాళ్ళ సంకుచిత మనస్తత్వాన్ని బయట పెడుతుంది.

చిన్నతనంలో లో వారి మనసుల్లో మంచి నాటుకుంటే మంచి.  చెడు ప్రేరేపిస్తే చెడుగా వాళ్ళ ఎదుగుదల ఉంటుంది అన్నది మాత్రం నిజం.

ఎందుకంటే చిన్నపిల్లలు మట్టి ముద్దలు.  వాళ్లను ఏలా కావాలంటే అలా మలచుకోవచ్చు.

మనం బాల్యంలో వారికి ఏమి అందిస్తే,  అవే మనం తిరిగి వారి వద్ద నుండి పొందవచ్చు.

మనం ప్రేమను పంచుతూ ఉంటే,  ప్రేమను అందుకునే బొమ్మలు వాళ్ళు.  మనం ఎలా మలిస్తే అలా రూపుదిద్దుకునే మట్టిబొమ్మలు వాళ్ళు.  అలాంటి బొమ్మల్ని మన స్వార్థం కోసం,  లేని రంగుల్ని పూసి , ప్రపంచం మాయలో వాళ్ళని తోయకూడదు.

పిల్లలకు కష్టం, సుఖం తెలియనివ్వాలి.  అంతేగాని,  మన కష్టాలన్నీ వాళ్ళపై రుద్దకూడదు అనేది నా అభిప్రాయం.

మీరు చెప్పే మంచిని ఆరోజు నేను గ్రహించలేకపోయాను మేడం.  ఇద్దరూ విడిపోయారు అంటే, ఇద్దరిలో తప్పు ఉండబట్టే కదా!!! అది ఆ రోజు నాకు అర్థం కాలేదు.  అమ్మ పైన అనవసరంగా ద్వేషం పెంచుకున్నాను ఇన్నాళ్లూ. ఆ విషయంలో నాకు ఇప్పటికి గాని కనువిప్పు కలగలేదు. అంటూ తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు విశ్వక్.

నీళ్ళు నిండిన కళ్ళతో అతని వైపే చూస్తూ,  వాడు చెప్పేదంతా వింటున్నాను.

తల్లిదండ్రులకు  నిజమైన ముద్దుబిడ్డ వీడు. ఎందుకంటే పరిపూర్ణత కలిగిన ఆలోచనతో ఒక అమ్మని సాకటమే కాదు,  అమ్మా నాన్నని కలిపిన ఆ బిడ్డ అంటే ఇద్దరి మనస్సులో ఎనలేని ప్రేమ జల్లే మొదలు అవుతుంది.

అలా కలిసిన వాతావరణంలో అమ్మా, నాన్న, చెల్లి అనే వాడు కోరుకున్న కుటుంబ వాతావరణం వాడి సొంతమైంది అది వాడి ప్రేరణతోనే.

అందుకనే  వీడు  ఇద్దరి మనసుల కి చేరువైన ముద్దుబిడ్డ అని నా మనసు చెప్పింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!