కార్తీకమాసం

కార్తీకమాసం

రచన: చెరుకు శైలజ

కృత్తిక నక్షత్రములో చంద్రుడు పూర్ణుడై సంతరించుట ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చినది.
కార్తీక మాసంతో సమానమైన మాసం వేరొకటి లేదు, విష్ణు దేవుని కంటే సమాన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రములు
పుణ్యప్రదమైన తీర్థలలో గంగినది కన్న పవిత్రమైనది మరొకటి లేదని పురాణ వచనం.
కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం, కార్తీకమాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు. లక్ష బిల్వార్చనలు ,రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అనే పేరు వచ్చింది.
అభిషేకం ప్రియా శివ..
శివునికి అలంకారాలతో రాజాసపరిచాలతోనైవేద్యలతో పనిలేదు. మనసులో భక్తి , అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాలను పోగొడుతుంది. సకల శుభాలను కలుగజేస్తుంది. కార్తీక మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు ఈతిబాధలు ఉండవు.
శివుని శ్రీ వృక్ష పత్రములతో( బిల్వ పత్రములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు పూజించిన ఫలితం.
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ.. ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వర దర్శనమిస్తాడు.
శివాలయం లో శివారాధన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యం కార్యములు ఆచరించడం వలన కార్తీకమాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి.
కార్తీక మాసంలో అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి.
తులసీదళాలతో శ్రీమహావిష్ణువు.. కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. కార్తీకమాసంలో విష్ణు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర అని కార్తీక మాస వ్రత దీక్ష ఆచరించాలి.
సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం.
కార్తీక మాసం శివుడు,విష్ణువు అనుగ్రహానికి ఉత్కృష్టమైనది.
ఏ మంత్ర దీక్ష చేసిన మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం.
కార్తీకమాసంలో రోజుకో అధ్యాయం కార్తీక పురాణం పారాయణం చేయడం శుభకరం.
కార్తీకమాసం సూర్యోదయానికి ముందే నదీ స్నానం అత్యంత ఫలప్రదం.
కావున నదీ స్నానంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది.
నదీజలాలు కొండలలో, కోణాల్లోను, చెట్టు పుట్టలను, తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వలన ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. కార్తీక మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే.. గౌరీదేవి ఈశ్వరుని అనుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు. కార్తీక మాసంలో స్నాన విధిని పాటించలేని వారు. పుణ్య తిథుల్లో స్నానమాచరింన పుణ్యం లభిస్తుంది. కార్తీకమాసం మొదటి నుండి ఆకాశదీపం ప్రారంభమవుతుంది.
గృహమునందు, పూజామందిరంలో తులసి సన్నిధిలో దీపారాధన ఆలయాలలోను ,దీపారాధన ఇహా లోక పర సౌఖ్యాలను కలగచేస్తుంది
కార్తీక మాసం దీపారాధనకు ప్రశస్త్యం .
దీప దానం ఆవు నెయ్యి ఉత్తమం
మంచి నూనె మధ్యము.
కార్తీక మాసం లో శుభ కార్యాలు, పెళ్ళిళ్ళు చేయడం కూడ ఎంతో శుభప్రదం.
ఉత్తనైకదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనది. సంవత్సరం అంతా దీపారాధన చేయకున్నా ఒక కార్తీక పౌర్ణమి రోజు 365ఒతులతో దీపం వెలిగిస్తే ఆది సంవత్సరం అంతా దీపారాధన చేసినాంత పుణ్యం. అందుకే ప్రతి ఒక్కరు దేవాలయాల్లో, గృహ లలో ఉసిరి తో దీపాలు, మూడు వందల ఒత్తు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిది. బంధువులతో, స్నేహితులతో కలిసి వనభోజనాలు జరుపు కుంటారు. అందుకే కార్తీక మాసం ఎంతో అత్యంత మైన మాసం. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికతను పెంచే మాసం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!